టాలీవుడ్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ కు ఇవాళ తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. తన దగ్గర పనిచేస్తున్న జూనియర్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఇవాళ కీలక తీర్పు వెలువరించింది. గతంలో జానీ మాస్టర్ కు జాతీయ అవార్డు తీసుకోవడం కోసం మధ్యంతర బెయిల్ మంజూరు కాగా.. ఇప్పుడు హైకోర్టు మరో ఆదేశం ఇచ్చింది.

మహిళా కొరియోగ్రాఫర్ తనపై చేసిన లైంగిక వేధింపుల నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేయడంతో జైల్లో ఉన్న జానీ మాస్టర్ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన హైకోర్టు ను కోరారు. అయితే జానీ మాస్టర్ పై వచ్చిన ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయని, బెయిల్ ఇవ్వొద్దని ప్రాసిక్యూషన్ వాదించింది. అయితే హైకోర్టు మాత్రం జానీ మాస్టర్ కు బెయిల్ ఇచ్చేందుకే మొగ్గు చూపింది.

ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న జానీ మాస్టర్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. అలాగే ఆయన బెయిల్ కు ఎలాంటి షరతులు కూడా విధించలేదు. దీంతో జానీ మాస్టర్ కు ఊరట లభించినట్లయింది. ఇప్పటికే జానీ మాస్టర్ పై కేసు, మీడియాలో జరుగుతున్న ప్రచారంతో ఆయన తల్లి నెల్లూరులో తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. అలాగే ఆయన భార్య కూడా తన భర్తపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని పదే పదే చెప్తున్న విషయం తెలిసిందే. మొత్తానికి జానీ మాస్టర్ కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించడంపై ఆయన కుటుంబసభ్యులు వర్షం రక్తం చేస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos