అఖండ 2 సినిమా రిలీజ్‌ను నిలిపివేయాలంటూ మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఈ సినిమాకు భారీ దెబ్బ పడే అవకాశం ఉంది. ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఎరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ (Eros) దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన మద్రాస్ కోర్టు సంచలన ఆదేశాలను జారీ చేసింది. ఎరోస్ సంస్థతో వివాదం పరిష్కారం అయ్యేంత వరకు సినిమాను విడుదల చేయకూడదని కోర్టు తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నది. నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన అఖండ సినిమాకు సీక్వెల్‌గా అఖండ 2 తాండవం రేపు డిసెంబర్ 5వ తేదీన రిలీజ్‌కు సిద్దమైంది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించింది. అయితే గతంలో ఈ సంస్థకు ఎరోస్ సంస్థతో ఉన్న ఆర్థిక లావాదేవీలు వివాదాస్పద కావడంతో సంచలనంగా మారింది. ఎరోస్ సంస్థకు, అఖండ 2 నిర్మాతలకు గతంలో చేసుకొన్న ఒప్పందం ప్రకారం సుమారుగా 28 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. అయితే వాటి చెల్లింపు కోసం పలు దఫాలుగా చర్చలు జరిగాయి. కానీ వాటి చెల్లింపు జరగకపోవడంతో ఎరోస్ సంస్థకు చెందిన వారు మద్రాస్ కోర్టును ఆశ్రయించారు. తమకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఇచ్చిన తర్వాతే అఖండ 2 సినిమా విడుదలకు అనుమతించాలని ఎరోస్ లీగల్ టీమ్ సభ్యులు కోర్టును వేడుకున్నారు. తమకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించకుండా అఖండ 2 సినిమాను రిలీజ్ చేస్తున్నారని వారు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఎరోస్ సంస్థ పిటిషన్ ను విచారించిన కోర్టు.. 28 కోట్ల రూపాయలతోపాటు అదనంగా 14 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఈ వివాదం పరిష్కారం కానంత వరకు సినిమాను రిలీజ్ చేయడానికి వీలు లేదంటూ  న్యాయస్థానం ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఈ పిటిషన్‌ను జస్టిస్ సుబ్రమణ్యం, జస్టిస్ కుమారప్పన్‌తో కూడిన డివిజన్ బెంచ్ విచారించి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం.. సినిమా విడుదల, డిస్ట్రిబ్యూషన్, వ్యాపార, వాణిజ్యపరమైన లావాదేవీలు జరపకూడదని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నది.  అయితే, ఈ వివాదం కోర్టు బయట సెటిల్‌మెంట్ ద్వారా త్వరగా పరిష్కారమవుతుందని, సినిమా విడుదలకు పెద్దగా ఆటంకం ఉండకపోవచ్చని ఫిల్మ్ నగర్ వర్గాలు భావిస్తున్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos