బాలీవుడ్ సినిమా ఒకటి ఇప్పుడు బాక్సాఫీస్ ను ఒక ఊపు ఊపేస్తోంది. యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారు ఈ సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. అంతగా వాళ్లను ఆకట్టుకున్న సినిమానే 'దురంధర్'. రణ్ వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించాడు. టైటిల్ తోనే ఈ సినిమా అందరిలోను ఆసక్తిని పెంచుతూ వెళ్లింది. పోస్టర్స్ తోనే ఈ సినిమాపై అంచనాలు .. నమ్మకాలు పెరుగుతూ వెళ్లాయి. Fఅలాంటి ఈ సినిమా ఈ నెల 5వ తేదీన భారీ స్థాయిలో విడుదలైంది. తొలి ఆటతోనే ఈ సినిమా హిట్ టాక్ ను తెచ్చుకుంది. యాక్షన్ డ్రామా ఆడియన్స్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయిందనే టాక్ వినిపించింది. టాక్ కి తగినట్టుగానే రోజు రోజుకీ వసూళ్లు పెరుగుతూ వెళ్లాయి. అలా వీకెండ్ పూర్తయ్యేనాటికి ఈ సినిమా 118 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ మొత్తం మరింత పెరుగుతుంది. రణవీర్ ఇంతకు ముందు చేసిన సినిమాలలో, 'పద్మావత్' .. 'సింబా' సినిమాలు తొలి మూడు రోజులలో 75 కోట్ల వసూళ్లు దాటాయి. ఆ రెండు సినిమాల వసూళ్లను అధిగమిస్తూ, ఈ సినిమా 100 కోట్ల వసూళ్లను దాటేయడం విశేషం. ఈ సినిమా జోరు చూస్తుంటే మరిన్ని రికార్డులను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రత్యేకమైన ఆకర్షణగా ఈ సినిమాలో సంజయ్ దత్ .. అర్జున్ రాంపాల్ .. అక్షయ్ ఖన్నా .. సారా అర్జున్ కనిపించనున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను భారీ రేటుకు 'నెట్ ఫ్లిక్స్' వారు దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Take Oath As A TDP National Working President | CM Chandrababu | AG

తాజా వార్తలు

17-34-54-0654.jpg

మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించండి.. ఆర్టీజీఎస్ పై సమీక్షలో మంత్రి నారా లోకేష్ 
2026-06-26 Time: 05:34:54

15-49-17-0617.jpg

మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం.. ఆర్టీజీఎస్ పై సమీక్షలో అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
2026-06-22 Time: 03:49:17

15-31-26-0626.jpg

ప్రజా ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టులు.. 4 అంశాలపై ప్రోగ్రెస్ రిపోర్టులను విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు
2026-06-22 Time: 03:31:26

17-02-16-0616.jpg

అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు.. చిన్నారులతో కలిసి రాగి జావ తీసుకున్న చంద్రబాబు
2026-06-20 Time: 05:02:16

14-06-28-0628.jpg

90వ రోజు ప్రజాదర్బార్.. వివిధ సమస్యలపై ప్రజల  వినతుల స్వీకరణ.. అన్నివిధాల అండగా ఉంటానట్టు  మంత్రి లోకేష్ హామీ
2026-06-16 Time: 02:06:28

Related Videos