వరల్డ్‌కప్‌లో విజయం సాధించిన జట్టులో ఉంటూ కీలక పాత్ర పోషించిన శ్రీచరణికి ఆంధ్రప్రదేశ్‌లోకి ఘన స్వాగతం లభించింది. ఆమె ప్రతిభను మెచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మరికొందరు క్రీడాకారులు ఛాంపియన్‌లుగా మారి దేశానికి ఖ్యాతిని తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. గ్రూప్-1 ఉద్యోగం, ఇంటి స్థలం, రెండున్నర కోట్ల నగదు ఇవ్వాలని నిర్ణయించారు. ఉదయం గన్నవరం విమానాశ్రయంలో ఏసీఏ ఆధ్వర్యంలో శ్రీచరణికి ఘన ఘనస్వాగతం లభించింది. శ్రీచరణికి మహిళ మంత్రులు వంగలపూడి అనిత, సవిత, సంధ్యరాణి సాదరంగా ఆహ్వానించారు. ఆమెకు పుష్ఫగుచ్చం అందించి ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, సెక్రటరీ సానా సతీష్ బాబు, ట్రేజరర్ దండమూడి శ్రీనివాస్, శాప్ చైర్మన్ ఎ.రవినాయుడు అభినందనలు తెలిపారు. ఉమెన్ వరల్డ్ కప్ విజయంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శ్రీచరణి కీలకపాత్ర పోషించటం రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వ కారణమని ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్ అభిప్రాయపడ్డారు. ఆమెకు స్వాగతం పలికేందుకు అభిమానులు కూడా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. గన్నవరం నుంచి శ్రీచరణిని ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ నివాసానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు అత్తున్నతస్థాయిలో గౌరవం లభించింది. ఆమె ప్రతిభను చంద్రబాబు, లోకేష్ కితాబు ఇచ్చారు. అనంతం మంగళగిరి క్రికెట్ స్టేడియంలో ఏసీఏ ఆధ్వర్యంలో శ్రీచరణి మీడియా సమావేశం నిర్వహించారు. " ఏసీఏ నాకు అన్నివిధాలుగా తోడుగా నిలిచింది. ప్రభుత్వం గ్రూప్ 1 జాబ్ ఇస్తామని సీఎం చెప్పారు. 2.5 కోట్ల నగదు , కడపలో స్థలం ఇస్తామని సీఎం చెప్పారు. మోడీతో సమావేశం జరిగినప్పుడు మరింత ముందుకు ఎలా వెళ్ళాలనే విషయం చెప్పారని" అన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos