సమంత, రాజ్ నిడుమోరు వివాహానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోలలో సమంత ధరించిన కాస్ట్యూమ్ తోపాటు ఆమె వేలికి ఉన్న వెడ్డింగ్ రింగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వెడ్డింగ్ రింగ్ ప్రత్యేకతను తాజాగా ఓ జ్యువెలరీ వ్యాపారి బయటపెట్టారు. ఈ ఉంగరానికి చాలా పెద్ద చరిత్రే ఉందని వివరించారు. మొఘలుల కాలంలో తొలిసారి ఈ రకమైన డిజైన్ తో ఉంగరం తయారుచేశారని చెప్పారు.

పోట్రెయిట్ కట్ గా పిలిచే ఈ డిజైన్ ను స్వచ్ఛమైన స్వభావానికి చిహ్నంగా భావిస్తారని తెలిపారు. మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ భార్య ముంతాజ్‌ కు ఈ డిజైన్ ఉంగరాలంటే చాలా ఇష్టమని చరిత్రకారులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. పోట్రెయిట్ కట్ రింగ్ తయారీ కోసం వజ్రాన్ని ప్రత్యేక విధానంలో కట్‌ చేసి పలుచని గాజు పలకలా తయారు చేస్తారని జ్యువెలరీ వ్యాపారి చెప్పారు. ఈ రకమైన ఉంగరాలను అరుదుగా తయారు చేస్తారని పేర్కొన్నారు. సమంత వెడ్డింగ్ రింగ్ సుమారు రూ.1.5 కోట్ల విలువ చేస్తుందని చెప్పారు.

ఇదిలా ఉండగా కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో నిన్న డిసెంబర్ 1వ తేదీన జరిగిన సమంత వివాహ వేడుకకు కేవలం 30 మంది అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా జరిగిన ఈ పెళ్లి వార్త సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. ఆసక్తికరంగా, సమంత మాజీ భర్త నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల మొదటి వివాహ వార్షికోత్సవమైన డిసెంబర్ 4వ తేదీకి కేవలం మూడు రోజుల ముందు ఈ వివాహం జరగడం గమనార్హం.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos