గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వస్తున్న తరుణంలో, మేనియా మొదలైంది. గేర్ మార్చిన చిత్రబృందం ప్రమోషన్స్ ను పీక్స్ కు తీసుకెళ్లేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకుంటోంది. ఈ క్రమంలో రేపు 29వ తేదీన భారతదేశంలోనే అతి పెద్దదైన రామ్ చరణ్ కటౌట్ ను ఆవిష్కరించనున్నారు. ఇది మరెక్కడో కాదు ... విజయవాడలోని బృందావన కాలనీలో వెలవడనుంది.

ఈ కటౌట్‌ని గేమ్‌ ఛేంజర్‌ చిత్ర బృందం ఆవిష్కరించనుంది. దీనికి సంబంధించిన పనులు నాలుగు రోజులుగా ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి 15 వందల నుంచి రెండు వేల మంది అభిమానాలు వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. కటౌట్‌ ఓపెనింగ్‌ కార్యక్రమానికి అనుమతి ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. సుమారు 250 అడుగుల ఎత్తు గల ఈ భారీ కటౌట్‌ దేశంలోనే అతి పెద్దదని మెగా అభిమానులు చెబుతున్నారు. ఓపెనింగ్‌ తర్వాత కటౌట్‌పై హెలికాఫ్టర్‌తో పూలు చల్లే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటల నుంచి ఈ కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు గేమ్ చేంజర్ మేకర్స్ అనౌన్స్ చేశారు.

రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా సౌతిండియా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న గేమ్ చేంజర్ చిత్రం ప్రారంభం నుంచి ఓ రేంజ్ లో బజ్ క్రియేట్ చేసింది. తమన్ సంగీతంలో వచ్చిన ఈ సినిమా పాటలు ఆడియన్స్ ను ఉర్రూతలూగిస్తున్నాయి. దానికి తోడు టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఎక్స్ పెక్టేషన్స్ కు ఏమాత్రం తగ్గకుండా తమ చిత్రం ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. శంకర్ ట్రాక్ రికార్డు చూస్తే...గేమ్ చేంజర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. 

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos