స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న, ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి వివాహం జరగనుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తొలిసారిగా ఈ రూమర్స్‌పై రష్మిక స్పందించారు. తాజాగా ఓ హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత బలాన్నిచ్చాయి. ఈ వార్తలను తాను ఖండించలేనని, అలాగని ధ్రువీకరించలేనని రష్మిక తెలివిగా సమాధానమిచ్చారు. "నేను ఈ వార్తలను ఇప్పుడే ధ్రువీకరించలేను. అలాగని వీటిని ఇప్పుడు ఖండించనూ లేను. పెళ్లి గురించి సరైన సమయంలో, సరైన చోట మాట్లాడతాను. ఆ వివరాలను కచ్చితంగా అందరితో పంచుకుంటాను. అంతకుమించి ఇప్పుడేమీ చెప్పలేను" అని ఆమె పేర్కొన్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి బయట మాట్లాడటం ఇష్టం ఉండదని రష్మిక స్పష్టం చేశారు. పర్సనల్ లైఫ్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంటానని, ఇంట్లో పని గురించి, బయట వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావించనని తెలిపారు. ఇదే ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి మాట్లాడుతూ, ఈ ఏడాది తనకు ఎంతో ప్రత్యేకమని అన్నారు. "ఈ ఏడాది నా ఐదు సినిమాలు విడుదలై మంచి ఆదరణ పొందాయి. భాష, జోనర్ వంటి హద్దులు లేకుండా అన్ని రకాల పాత్రలు చేయాలని ముందునుంచీ అనుకున్నాను. నా విభిన్న పాత్రలను చూసి ప్రేక్షకులు ప్రశంసిస్తుంటే ఆనందంగా ఉందని" రష్మిక వివరించారు.

ఇటీవల ఓ చిట్‌చాట్‌లో పాల్గొన్న రష్మికకు తన భాగస్వామికి ఉండాల్సిన లక్షణాల గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ, "నన్ను పూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నా వైపు నుంచి ప్రతీ విషయాన్ని ఆలోచించాలి. నా పనిని గౌరవించాలి. ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తి అయితే బాగుంటుంది" అని తెలిపారు. అంతటితో ఆగకుండా, "మంచి వ్యక్తిత్వంతో పాటు, నా కోసం యుద్ధం చేయగల సత్తా అతనికి ఉండాలి. అలాంటి వ్యక్తి నా జీవితంలోకి వస్తే, అతని కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. అవసరమైతే యుద్ధంలో తూటాకు కూడా ఎదురెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను" అంటూ తన ప్రేమను, నిబద్ధతను తెలియజేశారు. ఆమె చెప్పిన లక్షణాలన్నీ విజయ్ దేవరకొండకు సరిగ్గా సరిపోతాయని, అతడిని ఉద్దేశించే రష్మిక ఈ వ్యాఖ్యలు చేసిందని అప్పట్లో నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఇప్పుడు ఆమె పెళ్లి గురించి వస్తున్న రూమర్స్ పై స్పందించిన తీరు చర్చనీయాంశమైంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos