మోహన్‌బాబు కుటుంబ వివాదంపై ఆయన భార్య నిర్మల తొలిసారి స్పందించారు. మంచు మనోజ్‌ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు వస్తున్న వార్తలపై ఆమె శనివారం స్పష్టతనిచ్చారు. మంచు విష్ణు తన ఇంట్లోకి వచ్చి జనరేటర్‌లో చక్కర పోశాడని మంచు మనోజ్ కంప్లైంట్ ఇచ్చిన విషయమై ఆమె మాట్లాడారు. ఆ కంప్లైంట్, ఆ ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని, అవన్నీ ఆరోపణలే అని మనోజ్ తల్లి, మోహన్ బాబు భార్య అయిన నిర్మలా దేవీ క్లారిటీ ఇచ్చారు. దీంతో మనోజ్ బండారాన్ని స్వయంగా కన్నతల్లి బయట పెట్టిన్నట్టయింది. . ప్రస్తుతం నిర్మలా దేవీ పేరు మీదున్న ప్రెస్ నోట్ ఒకటి వైరల్ అవుతోంది. ఈ మేరకు ఆమె పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌కు తెలిపినట్టుగా అందులో ఉంది.

'డిసెంబర్‌ 14న నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు  జల్‌పల్లిలోని మా ఇంటికి కేకు తీసుకొచ్చి సెలబ్రేట్‌ చేశాడని.. అయితే ఈ విషయంపై మంచు మనోజ్‌.. విష్ణు మీద అభాండాలు వేసి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడని నిర్మల దేవి ఫిర్యాదులో  పేర్కొన్నారు. విష్ణు ఆ రోజు ఎలాంటి గొడవ చేయలేదని... ఇంటికి వచ్చి తన గదిలోని వస్తువులు తీసుకుని కొద్దిసేపు నాతో మాట్లాడి వెళ్లిపోయాడని పేర్కొన్నారు. ఈ ఇంటిపై మనోజ్‌కు ఎంత హక్కు ఉందో.. పెద్ద కుమారుడు విష్ణుకీ అంతే హక్కు ఉందని. విష్ణు నా పుట్టినరోజు నాడు మనుషులతో ఇంట్లోకి రాలేదని.. మనోజ్‌ ఫిర్యాదులో నిజం లేదని నిర్మలా దేవి ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ ఇంట్లో పనిచేస్తున్న వాళ్లు కూడా 'మేమిక్కడ పనిచేయలేమంటూ వాళ్లే మానేశారని... ఇందులో విష్ణు ప్రమేయం లేదని ఆ లేఖలో నిర్మల పేర్కొన్నారు.

కాగా నిర్మలా దేవీ చెప్పిన దాని ప్రకారం.. జనరేటర్‌లో షుగర్ వేశాడనేది కేవలం డ్రామా అని అర్థం అవుతోంది. దీంతో మనోజ్ అసలు ఏం చేస్తున్నాడు.. మంచు కుటుంబంలో ఈ అంతర్గత కుమ్ములాట ఏంటి.. అసలు వారి ఫ్యామిలీలో ఏం జరుగుతోంది.. అరేయ్ ఏంట్రా ఇది అంటూ మంచు మనోజ్ గురించి నెట్టింట్లో కామెంట్లు చేస్తున్నారంతా.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos