రవి... ఇప్పుడు ఈ పేరే ఓ సంచలనం. ఎన్నో రోజులుగా కొత్త సినిమాల పైరసీతో అటు ఇండస్ట్రీని ఇటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు. చివరకు పోలీసులకే ఛాలెంజ్ విసరగా ఆ సవాల్ ను సీరియస్ గా తీసుకున్న పోలీసులు అతన్ని కటాకటాల్లోకి నెట్టారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రవి కేసును ఫేమస్ లాయర్ సలీం వాదించనున్నారు. అంతకు ముందు కోడికత్తి, గులకరాయి కేసులను ఈయనే వాదించారు. చట్ట పరంగా అతని హక్కుల కోసం తన వృత్తి ధర్మంగా పోరాడతానని లాయర్ సలీం అన్నారు. ఈ క్రమంలోనే రవి తండ్రి అప్పారావును లాయర్ సలీం తాజాగా కలిశారు. విశాఖ జిల్లాలోని పెదగత్తిలి సాలిపేటలో ఉంటున్న ఆయన్ను కలిసి కేసుకు సంబంధించి కొన్ని పేపర్లపై సంతకాలు పెట్టాలని కోరగా .. అందుకు అప్పారావు నిరాకరించినట్లు తెలుస్తోంది. తనకు ఇప్పటికే ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉందని... భవిష్యత్తులో కోర్టుల చుట్టూ తిరగలేనని అన్నట్లు సమాచారం. న్యాయస్థానాల చుట్టూ తిరిగే ఓపిక, సహనం లేవని తనను వదిలేయాలని లాయర్ తో చెప్పినట్లు తెలుస్తోంది. మరి దీనిపై లాయర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది. కాగా నిందితుడు రవిని పోలీసులు కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. చంచల్ గూడ జైలులో ఉన్న రవిని అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఫస్ట్ డే విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించాడు. ఎలాంటి భయం, బెరుకు లేకుండా పోలీసుల ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. తాను ఒంటరినని... ఇష్టం వచ్చింది చేసుకోవాలంటూ పోలీసులకు చెప్పాడు. అతన్ని కలిసేందుకు వెళ్లిన లాయర్లను సైతం కలవలేదు. తన ఫ్రెండ్ వచ్చి కలుస్తాడని చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు, రవికి సోషల్ మీడియా వేదికగా కొందరు మూవీ లవర్స్ సపోర్ట్ చేస్తుంటే మరికొందరు అతనికి శిక్ష పడడం సరైనదేనని అంటున్నారు. ఇప్పటికే రవి బెయిల్ పిటిషన్ ను అతని తరఫు లాయర్ సలీం దాఖలు చేశారు. "ఈ కేసు చాలా సింపుల్. సైబర్ క్రైమ్ కేసులో రవికి చాలా ఈజీగా బెయిల్ వస్తుంది. కానీ ఈడీ ఇన్వాల్వ్ అయితే మాత్రం బెయిల్ వచ్చేందుకు టైం పట్టొచ్చు.' అని లాయర్ సలీం చెప్పారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos