టాలీవుడ్ నటుడు మంచు మోహన్ బాబు కేసులో మళ్లీ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఆయన మరోసారి అజ్ఞాతంలోకి వెళ్లారని వార్తలు వస్తున్నాయి. మోహన్ బాబు కుటుంబం లోని గొడవలను కవరేజ్ చెయ్యడానికి ఆయన ఇంటి వద్దకు వెళ్లిన మీడియాపై దాడి చెయ్యడంతో మోహన్ బాబు  అడ్డంగా ఇరుకున్నారు. ప్రస్తుతం ఆ జర్నలిస్ట్ ఆసుపత్రి బెడ్ పై ఉన్నాడు. ఇక మోహన్ బాబు జర్నలిస్ట్ లపై దాడి చేయడంతో ఆయనపై హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు నమోదైంది.

విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు ఆయనకు  ఈ నెల 24 వరకు టైం ఇచ్చారు. అయితే మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా... అక్కడ నిరాశ ఎదురైంది. తాము మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని.. కౌంటర్ దాఖలు చేసిన తర్వాతనే విచారణ జరుపి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు. దీంతో మోహన్ బాబు 16వ తేదీ హైదరాబాద్ నుంచి చంద్రగిరికి చేరుకున్నారు. 

18వ తేదీ బుధవారం సాయంత్రం నుంచి శ్రీ విద్యానికేతన్ నుంచి బయటికి వెళ్లిపోయిన మోహన్ బాబు ఆ తర్వాత కనిపించడం లేదని అంటున్నారు. ఆయన బెంగళూరులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు . పోలీసులుఏ క్షణమైనా పోలీసులు అరెస్ట్‌ చేస్తారనే భయంతోనే మోహన్ బాబు మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్లారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Related Videos