మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో మరో అరుదైన గౌరవం చేరింది. తెలంగాణ గద్దర్ అవార్డ్స్ 2026లో ఆయన ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. నిన్న గురువారం రాత్రి మాదాపూర్ హైటెక్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన ఈవెంట్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ... విజేతలందరికీ అభినందనలు తెలిపారు. ఏపీ ప్రభుత్వం కూడా కళాకారులకు అవార్డులు ఇస్తే ప్రోత్సాహకంగా ఉంటుందని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. 'తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. కళాకారులు ఉన్న చోటే సుభిక్షంగా ఉంటుందనేది నానుడి. ఈ అవార్డులు అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు. "ఏపీ ప్రభుత్వం కూడా ఇలా అవార్డులు ఇస్తే బాగుంటుంది.' ఆంధ్రప్రదేశ్ కళాకారుల పట్ల, సినిమాల పట్ల ఉత్సాహపరిచే విధానంలో కాస్త వెనుకంజ వేసిందని అనుకుంటున్నాను. సినిమాలకు దగ్గరగా ఉండే సీఎం చంద్రబాబు గారు దీన్ని ప్రేరణగా తీసుకొని మరింత ప్రోత్సహించాలి. తద్వారా రాష్ట్రానికి రెవెన్యూ కూడా పెరుగుతుంది. ఈ ఆలోచన చేయాలని ఈ వేదిక నుంచి విన్నవిస్తున్నాను’ అని చిరంజీవి అన్నారు. చిరంజీవితో పాటే పైడి జయరాజ్ పురస్కారాన్ని కమల్ హాసన్, నాగిరెడ్డి చక్రపాణి అవార్డును నిర్మాత అశ్వనీదత్, కెఎల్ కాంతారావు ఫిల్మ్ అవార్డును ఆర్ నారాయణమూర్తి, సినారె అవార్డును రైటర్ సుద్దాల అశోక్ తేజ, అక్కినేని నాగేశ్వరరావు అవార్డును జయసుధ స్వీకరించారు. బీఎన్‌రెడ్డి ఫిల్మ్ అవార్డును సింగీతం శ్రీనివాసరావు తరఫున కమల్ హాసన్ అందుకున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos