ఐబొమ్మ ప్రధాన నిర్వాహకుడు ఇమంది రవిని పోలీసులు బుధవారం మరోసారి కోర్టులో హాజరు పరిచారు. మరో కేసులో ఇమంది రవిపై సైబర్ క్రైమ్ పోలీసులు పిటి వారెంట్ వేశారు. రెండో కేసులో ఇమంది రవికి నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఇమంది రవిపై మొత్తం ఐదు కేసులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేశారు. తాజాగా మరో కేసులో నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. మిగిలిన మూడు కేసులపై కూడా సైబర్ క్రైమ్ పోలీసులు పీటీ వారంట్ వేశారు. కోర్టు అనుమతితో.. మూడు కేసుల్లో కూడా ఐబొమ్మ రవిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేయనున్నారు. మరోవైపు కస్టడీ ఇవ్వాలంటూ వేసిన పోలీసుల పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి. పోలీస్ కస్టడీ పిటిషన్పై నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించనుంది. ఐ బొమ్మలో సినిమాలు చూసిన వారందరి డేటా ఇమ్మడి రవి వద్ద ఉందని ఏసీపీ శ్రీనివాసులు ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐదు రోజుల కస్టడీలో ఆయన నుంచి పలు కీలక విషయాలు రాబట్టినట్టు ఆయన చెప్పారు.

ఐబొమ్మ వెబ్ సైట్కు వెళ్లగానే కండీషన్ అగ్రీ చేయాలనే ఆప్షన్ ఉంటుందని, దానికి టిక్ చేయగానే మన ఫోన్లో ఉన్న మొత్తం సమాచారం రవికి వెళ్లిపోతుందని అన్నారు. అందులో వ్యూయర్ షిప్ను చూపించి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు చేశాడని తెలిపారు. ఐబొమ్మలో ఏదైనా సినిమా చూసేందుకు ప్రయత్నిస్తే ముందుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వస్తుందని వివరించారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా సినిమాలు కొనుగోలు చేసుకొనే వాడని వివరించారు. రవిని ఆయన భార్య పట్టించిందనడంలో నిజం లేదని ఏసీపీ చెప్పారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos