ఎన్నికల సమయంలో నంద్యాలలో తన మిత్రుడు శిల్పా రవి ఇంటికి వెళ్లి అల్లు అర్జున్ సందడి చేశాడు. ఎన్నికల కోడ్‌ను బన్నీ అక్కడ ఉల్లంఘించాడు. అనుమతి లేకుండా జన సమీకరణ చేశాడంటూ బన్నీపై కేసు నమోదు అయింది. ఆ కేసుని కొట్టివేయాల్సిందిగా అల్లు అర్జున్ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటీషన్ వేశాడు. ఈ పిటీషన్ మంగళవారం నాడు విచారణకు వచ్చే అవకాశం ఉంది. వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి బన్నీ సపోర్ట్ చేయడం అప్పట్లో వివాదానికి దారి తీసింది.

ఆ టైంలో సెక్షన్ 144, పోలీసు యాక్టు 30 అమల్లో ఉండగా..అనుమతి లేకుండా జనసమీకరణ చేపట్టారని అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిని గెలిపించాలంటూ అక్కడి మీడియాతో కూడా మాట్లాడాడు. తన మిత్రుడి కోసం ఇక్కడకు వచ్చానని, ఆయన పిలవలేదని, తానే స్వయంగా వచ్చానని అన్నాడు. ఇలా బన్నీ అప్పుడు పెట్టిన మంట ఇప్పటి వరకు చల్లారలేదన్న సంగతి తెలిసిందే.

నంద్యాల ఎపిసోడ్ తరువాత బన్నీ మీద మెగా ఫ్యాన్స్, జన సైనికులు ఎక్కువగా ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. ఫ్యామిలీ అంతా పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్ చేస్తుంటే.. బన్నీ వెళ్లి వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్నాడంటూ మండిపడ్డారు. ఇక నంద్యాల ఎపిసోడ్ తరువాత బన్నీని సాయి ధరమ్ తేజ్ అన్ ఫాలో అయ్యాడనే టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. నాగ బాబు సైతం పరోక్షంగా బన్నీ మీద కౌంటర్లు వేశాడని సోషల్ మీడియాలోని ట్వీట్లను అందరూ విశ్లేషించిన విషయం విధితమే.

నంద్యాల ఇష్యూ, నాటి కేసుని కొట్టి వేయమని హైకోర్టులో బన్నీ వేసిన ఈ పిటీషన్‌తో మళ్లీ నాటి సంగతుల్ని, వీడియోల్ని, మాటల్ని అందరూ నెట్టింట షేర్ చేస్తున్నారు. మరి ఈ విచారణలో కోర్టు ఏం చెబుతుందో.. తీర్పు ఎలా వస్తుందో చూడాలి. బన్నీ ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. డిసెంబర్ 6న పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

Related Videos