మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన మన శంకర వరప్రసాద్ గారు (MSG) చిత్రం విడుదల కాకముందే ఓవర్సీస్‌లో సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా యూకేలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పింది. విడుదలకి ఇంకా వారం రోజులు సమయం ఉండగానే, అప్పుడే 10,000కు పైగా టికెట్లు అమ్ముడవడంతో మెగాస్టార్ క్రేజ్ మరోసారి రుజువైంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇందులో విక్టరీ వెంకటేశ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. చిరంజీవి వింటేజ్ లుక్, వెంకటేశ్ మార్క్ కామెడీ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇప్పటికే చిరంజీవి, వెంకటేశ్‌లపై చిత్రీకరించిన పార్టీ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ సినిమాపై అంచనాలను పెంచింది. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం కూడా మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. యూకేలో ఒక రోజు ముందుగానే, అంటే జనవరి 11న గ్రాండ్ ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు.

ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అహింసా ఫిల్మ్స్, సరిగమ సినిమాస్, బోలిన్ సినిమా (UK) కలిసి ఈ చిత్రాన్ని యూకేలో భారీ ఎత్తున విడుదల చేస్తున్నాయి. ఈ సంక్రాంతికి ఇది అతిపెద్ద ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి నుంచి వస్తున్న పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ కావడంతో మెగా అభిమానులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos