మన శంకర వరప్రసాద్‌ గారు సంక్రాంతి పండక్కి వచ్చేశారు.. ప్రీమియర్స్ తోనే థియేటర్లలో పండగ వాతావరణం తీసుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఆదివారం రాత్రి ప్రదర్శించిన ప్రీమియర్ షోల నుంచే ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చింది. చాలా రోజుల తర్వాత వింటేజ్‌ బాస్ ను చూశామంటూ మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ రెస్పాన్స్ చూసి చిరు సైతం ఖుషీగా ఉన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం రాత్రి 'మన శంకర వరప్రసాద్‌ గారు' సినిమా ప్రీమియర్ షోలు పడ్డాయి. వీటికి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ప్రీమియర్స్‌ పూర్తవ్వగానే అర్ధరాత్రి చిత్ర బృందం సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ చేసుకుంది. శ్రీరాములు థియేటర్ లో షో చూసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. నిర్మాత సాహు గారపాటితో కలిసి నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. చిరు, అనిల్‌ రావిపూడి, సాహు, సుస్మిత కొణిదెల కలిసి ఒకరికొకరు స్వీట్స్‌ తినిపించుకున్నారు.

'మన శంకర వరప్రసాద్‌ గారు' సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఫోటోలను నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పంచుకుంది. ఇందులో చిరంజీవి - అనిల్ రావిపూడి ఎంతో సంతోషంగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. మొత్తానికి కామెడీ  ప్రధానంగా సరదాగా సందడి చేసే కంటెంట్ తో కూడిన సినిమా ఇది. సంక్రాంతికి ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని సినిమా విశ్లేషకులు అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos