హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన మరో కీలక మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అల్లు అర్జున్ కు హైకోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ ను రద్దు చేయాలని హైదరాబాద్ పోలీసులు సుప్రీం కోర్టుకు వెళ్లనున్నారన్న ప్రచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పోలీసు అధికారులు ప్రస్తుతం ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారని.. వాళ్ళ నుండి ఆదేశాలు వచ్చిన వెంటనే పిటిషన్ ని వేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న నెటిజెన్స్ అల్లు అర్జున్ మీద పోలీసులు ఇలా పగబట్టేశారేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా నిన్ననే పోలీసులు అల్లు అర్జున్ ప్రీమియర్ షో చూడడానికి వచ్చేందుకు మేము అనుమతులు ఇవ్వడం లేదని, అందుకు సంబంధించిన లేఖ ఇదేనంటూ మీడియా కి ఒక కాపీని విడుదల చేసారు. అయితే ఈ కాపీ నమ్మశక్యంగా లేదని అల్లు అర్జున్ అభిమానులు కౌంటర్ వేశారు. ఇది కేవలం అల్లు అర్జున్ ని ఇరకాటం లో పెట్టడానికి అప్పటికప్పుడు సృష్టించిన లేఖ లాగా అనిపిస్తోందంటూ కామెంట్స్ చేసారు. పోలీసుల దగ్గర ఈ సాక్ష్యం ముందు నుండే ఉంటే మొన్న బెయిల్ విచారణ సమయంలో కోర్టులో ఎందుకు సబ్మిట్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే అల్లు అర్జున్ ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడని, సక్సెస్ మీట్ లో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం వల్ల, ఆయన ఈగో దెబ్బతినిందని, దానిని మనసులో పెట్టుకొనే ఇదంతా చేస్తున్నారని అభిమానులు ఆరోపిస్తున్నారు.
మరోపక్క తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుమారుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి పై అల్లు అర్జున్ టీం ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉంది. ఆ బాలుడి ఆరోగ్యం మెరుగుపడడానికి సింగపూర్ నుండి ఒక ఇంజక్షన్ తెప్పించాలని, దానికి చాలా ఖర్చు అవుతుందని అల్లు అర్జున్ కి చెప్పడంతో, వెంటనే ఆయన స్పందించి ఆ ఇంజక్షన్ ని సింగపూర్ నుండి తెప్పించాడని తెలుస్తోంది. కేసు కోర్టులో నడుస్తున్నందున ఇప్పటికైతే శ్రీ తేజ్ ని కలిసే పరిస్థితులు లేవని, త్వరలో ఈ సమస్యలు సర్దుకున్నాక శ్రీతేజ్ ని కలుస్తానని అల్లు అర్జున్ కలుస్తాడని ఆయన అభిమానులు చెబుతున్నారు. కాగా సుప్రీంకోర్టును ఆశ్రయించి అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతుండడంతో బన్నీ అభిమానులు కలవర పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఏం జరుగుతుందో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos