‘మాయాజాలం’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఒక విచిత్రం, శౌర్యం, వినాయకుడు, నాగవల్లి, గగనం, శ్రీనివాస కళ్యాణం చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి పూనమ్ కౌర్ . తెలుగుతో పాటు తమిళం, మలయాళ చిత్రాల్లో నటించింది. హీరోయిన్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా అవకాశాలు రాక క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది. ఆ సినిమాలు కూడా పెద్దగా ఆడకపోవడంతో ఛాన్సులు లేక ఇండస్ట్రీ నుంచి కనుమరుగైంది. సినీ పరిశ్రమకి దూరంగా ఉన్నా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వివాదాస్పద ట్వీట్లతో తరుచూ వార్తల్లోకి ఎక్కుతుంటుంది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ గురించి ఎవరైనా పొగిడితే వారిపై అంతెత్తున ఎగిరిపడుతుంది. తనను మోసం చేశాడంటూ ఇటీవల ఆమె త్రివిక్రమ్‌పై ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. అంతేకాదు ‘ఓజీ’ చిత్రాన్ని పొగుడుతూ ఆర్‌టీవీ ఛైర్మన్ రవిప్రకాష్ ట్వీట్ చేస్తే.. Shame on U అంటూ ఆయనపై రెచ్చిపోయింది.

తాజాగా పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ మరోసారి చర్చకు దారితీసింది. ‘బాలయ్య ఎప్పుడూ చిన్నపిల్లాడిలా ఉత్సాహంగా ఉంటారని నేను ఎప్పుడూ చెబుతుంటాను. దేవుడు కొందరు వ్యక్తుల్ని ఓ లక్ష్యం కోసం సాధనంలా సృష్టిస్తాడు. అది సమయానుసారం బయటపడుతుంది’ అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. సినీ వజ్రోత్సవాల్లో ‘సమర సింహారెడ్డి’ చిత్రంలోని నందమూరి నాయకా అందమైన కానుకా ముందరుంది చూసుకోరా అనే సాంగ్‌కి తాను డ్యాన్స్ వేస్తుంటే బాలకృష్ణ ఉత్సాహంగా ఊగిపోతూ చూసే వీడియోను 2024, సెప్టెంబర్ 1న పూనమ్ ట్వీట్ చేసింది. అందులో ‘బాలయ్య పెద్ద వృక్షం లాంటి వారు. అది అన్ని సీజన్లలోనూ మనుషులు, జంతువులకు నీడనిస్తుంటుంది. ఆదిత్య 369 నుంచి భగవంత్ కేసరి వరకు ఆయన చిన్న పిల్లాడిలా ఉత్సాహంగానే కనిపిస్తున్నారు. అది ఆయనకు దేవుడు, తండ్రి ఎన్టీఆర్ ఇచ్చిన ఆశీర్వాదం’అని ట్వీట్ చేసింది. అప్పటి ట్వీట్‌ని ట్యాగ్ చేస్తూ పూనమ్ తాజా ట్వీట్ చేయగా క్షణాల్లో వైరల్ అయింది.

పూనమ్ కౌర్ ట్వీట్‌పై బాలకృష్ణ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుండగా మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మెగా ఫ్యామిలీపై కోపంతో బాలయ్యని పొగుడుతున్నావా.. ఆడపిల్ల కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలంటూ ఆయన అన్న మాటలు మరిచిపోయావా? అని పూనమ్‌కి గుర్తుచేస్తున్నారు. మహిళలపై గౌరవం లేని వ్యక్తిని నువ్వు పొగడటం అస్సలు బాగోలేదని కామెంట్లు చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో ఎదగలేకపోయావు కాబట్టే ఇలా వివాదస్పద ట్వీట్లతో ఫేమస్ కావాలని అనుకుంటున్నావా? అని నిలదీస్తున్నారు. ఇటీవల ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే హోదాలో బాలకృష్ణ మాట్లాడుతూ చిరంజీవిపై కొన్ని కామెంట్స్ చేశారు. అయితే బాలకృష్ణ వ్యాఖ్యల్ని ఖండిస్తూ చిరంజీవి ఘాటుగా ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే సోషల్‌ మీడియాలో నందమూరి - మెగా ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతోంది. ఈ టైమ్‌లో పూనమ్ చేసిన ట్వీట్ మరింత అగ్గి రాజేసిందని సినీ, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos