గ్లోబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు అంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆయన నటించిన బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 చిత్రాలను కలిపి.. "బాహుబలి ఎపిక్" పేరుతో రిలీజ్ కానుంది. ప్రస్తుతం జపాన్ లో మన చిత్రాలకు మంచి డిమాండ్ ఉంది. గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్.. 'ముత్తు' సినిమాతో జపాన్ లో కూడా భారీ హిట్ అందుకున్నారు. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' మూవీ సైతం మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ ప్రముఖ నటుడు, డార్లింగ్ ప్రభాస్ జపాన్ లో పర్యటిస్తున్నారు. ఈ నెల 12న ‘బాహుబలి: ది ఎపిక్’ జపాన్ లో విడుదల కానుంది. సినిమా ప్రచారం కోసం జపాన్ వెళ్లిన ప్రభాస్.. అక్కడి అభిమానులతో కలిసి సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జపాన్ లో పెను భూకంపం సంభవించిందనే వార్తలతో ప్రభాస్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. 

జపాన్ లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అక్కడ అభిమానులను కలుస్తూ ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న వీడియోలు సైతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అయితే జపాన్ ఉత్తర తీరంలో భారీ భూకంపం సంభవించడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇందుకు టాలీవుడ్ డైరెక్టర్ మారుతి వారికి రిప్లై ఇచ్చారు. ప్రభాస్‌ క్షేమంగా ఉన్నారని వెల్లడించడంతో ఫ్యాన్స్ కొంచెం కూల్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఒక అభిమాని.. జపాన్ లో భూకంపం వచ్చింది.. సునామీ హెచ్చరికలు జారీ చేశారు. మా హీరో ఎక్కడ ఉన్నాడు.. ఈరోజు సాయంత్రం రిటర్న్ అవుతారా? అని మారుతిని ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టాడు.

అందుకు మారుతి రిప్లై ఇస్తూ.. ప్రభాస్‌తో ఇప్పుడే మాట్లాడానని.. భూకంపం వచ్చిన ప్రాంతంలో ఆయన లేరని క్షేమంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందకండి అని రిప్లై ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతితో "రాజా సాబ్‌" సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్ తో పాటు.. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సంజయ్ దత్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్ లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos