సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న మైథలాజికల్ అడ్వెంచర్ మూవీ వారణాసి. ఈ మూవీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చిక్కుల్లో పడ్డారు. హైదరాబాద్ ఫిల్మ్ సిటీలో టైటిల్ ఆవిష్కరణ సందర్భంగా ఇచ్చిన ప్రసంగం, చేసిన వ్యాఖ్యలు ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టాయి. చట్టపరమైన ఇబ్బందుల్లోకి నెట్టాయి. తనకు దేవుడిపై నమ్మకం లేదని రాజమౌళి చెప్పడం.. హిందూ సంఘాల ప్రతినిధులకు ఆగ్రహానికి గురి చేసింది.

ఆంజనేయ స్వామిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యల పట్ల కోట్లాదిమంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని రాష్ట్రీయ వానరసేన సంఘం ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అందులో పలు అంశాలను ప్రస్తావించారు. సాక్ష్యంగా ప్రింట్ మీడియాలో వచ్చిన కొన్ని క్లిప్పింగ్ లను వాళ్లు తమ ఫిర్యాదు పత్రానికి జత చేసినట్లు చెబుతున్నారు. వారణాసి చిత్రం టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమంలో హనుమంతుడిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉన్నాయని ఫిర్యాదులో పొందుపరిచారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కఠినంగా శిక్షించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఎవరూ కూడా దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండేలా ఈ చర్యలు ఉండాలని అన్నారు. ఒకరికి కఠిన శిక్ష పడితే మరొకరు అటువంటి వ్యాఖ్యలు చేయడానికి భయపడతారని పేర్కొన్నారు.

దీనికి వివరణ ఇచ్చాడు రాజమౌళి. తనకు దేవుడిపై నమ్మకం లేదని చెప్పాడు. టైటిల్ ఆవిష్కరణ సమయంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తినప్పుడు తాను ఆందోళనకు గురయ్యానని, తన తండ్రి విజయేంద్రప్రసాద్ ధైర్యం చెబుతూ.. అంతా హనుమంతుడు చూసుకుంటాడని, వెనక ఉండి నడిపిస్తాదంటూ సముదాయించారని చెప్పారు. టెక్నికల్ ఎర్రర్ వచ్చినప్పుడు అసహనానికి గురయ్యానని రాజమౌళి అన్నాడు. తన భార్య రమాకు హనుమాన్ అంటే చాలా చాలా ఇష్టమని వ్యాఖ్యానించాడు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos