వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒంగోలు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయనను ప్రస్తుతం ఒంగోలు సీఐ ప్రశ్నిస్తున్నారు. వ్యూహం సినిమా విడుదలకు ముందు ప్రమోషన్లలో భాగంగా చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ పై అనుచిత పోస్టింగ్ లు పెట్టినందుకు రామ్ గోపాల్ వర్మ పై మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయిన సంగతి తెలిసిందే.

అయితే గతంలో అనేక సార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాని వర్మ నేడు పోలీసుల విచారణకు హాజరయ్యారు. హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందారు. అయితే రోడ్డు మార్గాన వచ్చిన రామ్ గోపాల్ వర్మ మద్దిపాడు సమీపంలోని వెల్లంపల్లి వద్ద ఉన్న ఒక హోటల్ వద్ద ఆగారు. అక్కడ వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భేటీ అయ్యారు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్న అనంతరం రామ్ గోపాల్ వర్మ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరయ్యారు.

రాంగోపాల్ వర్మ 2023లో వ్యూహం, శపథం అనే రెండు సినిమాలు తీశారు. వ్యూహం సినిమాల విడుదల సందర్భంగా చంద్రబాబు, పవన్, లోకేశ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. వారి పరువుకు భంగం కలిగించారంటూ టీడీపీకి చెందిన మద్దిరాలపాడు మండల కార్యదర్శి రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టులను పరిశీలించిన పోలీసులు సెక్షన్ల కింద  రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు. అలాగే గుంటూరు జిల్లా తుళ్లూరు,. అనకాపల్లి జిల్లా రావికమతం పోలీస్ స్టేషన్ లోనూ రాంగోపాల్ వర్మపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 

వాస్తవంగా ఈ కేసులో నాలుగో తేదీన హాజరు కావాలని ఆయనకు ఒంగోలు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే తనకు కుదరదని...ఏడో తేదీన వస్తానని వర్మ సమాచారం ఇచ్చారు. దానికి పోలీసులు అంగీకరించడంతో ఇవాళ శుక్రవారం శుక్రవారం ఒంగోలు పోలీసుల ఎదుట హాజరయ్యారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos