నటసింహం నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం అఖండ 2. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. అనూహ్య కారణాల వల్ల వాయిదా పడింది. కానీ మొత్తానికి అభిమానులను, సినీ ప్రేమికులను ఖుషి చేస్తూ అడ్డంకులు తొలగించుకొని డిసెంబర్ 12న ఆడియన్స్ ముందుకు రాబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. 11న ప్రీమియర్స్ ఉంటాయని చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ అంతా ఈ మూవీ కోసం తెగ ఎదురు చూస్తున్నారు. బాలయ్య - బోయపాటి కాంబినేషన్ లో గతంలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు భారీ హిట్స్ అందుకోవడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కాగా 'అఖండ' మూవీకి సీక్వెల్ గా ఈ చిత్రం రాబోతుంది. ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తుండగా.. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, ట్రైలర్ లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తమన్ మరోసారి తన సంగీతంతో స్పీకర్స్ బద్దలవ్వడం ఖాయమని చెబుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి 'డాకు మహరాజ్'తో హిట్ అందుకున్న ఆయన.. మొత్తంగా వరుసగా నాలుగు సినిమాలు హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఈ మూవీతో కూడా హిట్ కొట్టి సక్సెస్ జర్నీ కొనసాగించాలని భావిస్తున్నారు. కాగా ఒక వైపు బాలయ్య మూవీ వస్తుందన్న ఆనందం ఒక వైపు ఉంటే.. మరో వైపు మాత్రం అదే రోజు విడుదలకు ప్లాన్ చేసుకున్న 16 సినిమాల పరిస్థితి ఏంటని జోరుగా చర్చ నడుస్తోంది. ముందుగా అనుకున్న తేదీకి "అఖండ 2" వాయిదా పడటం అందరినీ తీవ్ర నిరాశకు గురి చేసింది.

అన్నీ సరిగ్గా జరిగి ఉంటే డిసెంబర్ 5న అఖండ 2 విడుదల అవ్వాల్సింది. దాంతో చిన్న సినిమాలు అన్ని ఒక వారం గ్యాప్ తో 12న రిలీజ్ ప్లాన్ చేసుకున్నాయి. కానీ ఇప్పుడు బాలయ్య సినిమా తేదీ మార్చుకోవడంతో ఆ చిన్న సినిమాల వ్యవహారం అయోమయంలో పడింది. చిన్న సినిమాలు మినహాయిస్తే మోగ్లీ, సైక్ సిద్దార్ధ్, అన్నగారు వస్తారు, ఇట్స్ ఒకే గురు వంటి చిత్రాలకు మంచి బజ్ ఉంది. ఈ తరుణంలో బాలయ్య సినిమా వస్తే వాటికి ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos