ఎస్‌ఎస్ రాజమౌళి... టాలీవుడ్‌ను ప్రపంచ వేదికకు పరిచయం చేసిన దర్శక ధీరుడు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ చిత్రం వారణాసి సినిమా తీస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా గ్లోబ్‌ట్రాటర్ పేరుతో వారణాసి చిత్రం మెగా ఈవెంట్ నిర్వహించారు. ఆ సమయంలో ఈ దర్శకధీరుడు కొన్ని కామెంట్స్ చేశారు. తనకు దేవుడంటే నమ్మకం లేదని చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీంతో కొందరు రంగంలోకి దిగి రాజమౌళిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ పోస్టులపై సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ స్పందించారు.

ఎవరైతే ఈ దర్శకధీరుడిని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేయడం మొదలెట్టారో వారి భరతం పట్టేందుకు రాంగోపాల్ వర్మ రంగంలోకి దిగారు. రాజమౌళి చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని చెప్పుకొచ్చారు. రాజమౌళి నాస్తికుడిగా ఉండటంలో తప్పేముందని వెనకేసుకొచ్చిన ఆర్జీవీ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 గురించి గుర్తు చేశాడు. ఎవరి మతవిశ్వాసాలు వారికుంటాయని, దేవుడిని నమ్మాలో వద్దో కూడా ఒకరి ఇష్టం మీదే ఉంటుందని అన్నారు.కాబట్టి రాజమౌళి దేవుడిని నమ్మననని చెప్పడంలో తప్పులేదని ఆయనపై అదే పనిగా విషం చిమ్ముతున్న వారికి సూచన చేశారు ఆర్జీవీ. దేవుడిని నమ్ముతున్నామని చెప్పుకునే పెద్దమనుషుల సమస్య నాస్తికత్వం కాదని.. దైవం అంటే నమ్మకం లేని జక్కన్న లాంటి వారు సక్సెస్ సాధించడాన్ని ఓర్వలేక పోతున్నారని తేల్చిపారేశారు. 24 గంటలు భక్తితో పూజలు చేసిన వారు మాత్రం జీవితంలో పైకి ఎదగలేకపోవడంతోనే వారిలో అసహనం పెరిగిపోతోందని ఆర్జీవీ అన్నారు.

రాజమౌళి నాస్తికుడిగా ఉన్నప్పటికీ... ఎక్కడా భగవంతుడిని తక్కువ చేసి చూపించలేదు లేదా ఆయన విలువ తగ్గించేలా ఎక్కడా మాట్లాడలేదని ఆర్జీవీ గుర్తుచేశారు. రాజమౌళి లాంటి సెలబ్రిటీలు దేవుడిని నమ్మననే వ్యాఖ్యలు చేస్తే... మిగతా ప్రపంచం కూడా అదే ఫాలో అవుతుందేమో అన్న భయం ఈ పెద్దమనుషులను ఆవహించి ఉందని అదే వారి సమస్య అని ఆర్జీవీ క్లియర్‌గా చెప్పేశారు. కాబట్టి దేవుడు బాగున్నాడు, రాజమౌళి కూడా బాగున్నాడు. సమస్య అంతా దీన్ని అర్థం చేసుకోని మనుషులదే అని చెప్పుకొచ్చారు. ఇక వారణాసి సినిమాను ఆ భగవంతుడు హిట్‌ చేస్తారని జోస్యం చెప్పిన రాంగోపాల్ వర్మ.. జక్కన్న బ్యాంక్ బ్యాలెన్స్ మరింత పెరుగుతుందని చెప్పారు. అప్పుడు ఈ పెద్ద మనుషులంతా ఇంకా విషం చిమ్ముతూ.. అసూయ పడతారని వెల్లడించారు. మొత్తానికి ఇది భగవంతుడో, భక్తో , లేదా దేవుడిపై విశ్వాసమో కాదని కేవలం అసూయతోనే వీరంతా జక్కన్నపై విషం కక్కుతున్నారంటూ తన ట్వీట్‌ను ముగించాడు రాంగోపాల్ వర్మ.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos