శోభిత ధూళిపాళ‌…. ఇప్పుడు ఈ పేరు తెలియని వారు ఉండరు. మోడ‌ల్ గా, న‌టిగా రాని గుర్తింపు, ప‌బ్లిసిటీ నాగ‌చైత‌న్య‌తో రిలేష‌న్ షిప్ లో సంపాదించింది. త్వరలో అఫీషియ‌ల్ గా అక్కినేని ఇంటి కోడ‌లు కాబోతోంది. నాగ‌చైత‌న్య‌తో నిశ్చితార్థం అయిన‌ప్ప‌టి నుంచీ శోభిత పేరు ట్రెండింగ్ లో ఉంది. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో స‌మంత ఫ్యాన్స్ వర్సెస్ శోభిత ఫ్యాన్స్ మ‌ధ్య ర‌చ్చ ర‌చ్చ జ‌రుగుతోంది. ఎప్పుడైతే శోభిత అక్కినేని ఇంటికి కోడ‌లు కాబోతోందన్న విష‌యం తెలిసిందో, అప్పుడే స‌మంత ఫ్యాన్స్ హ‌ర్ట‌యిపోయారు. చైతూతో స‌మంత విడాకులు తీసుకొన్న‌ప్పుడు కూడా పెద్దగా స్పందించ‌ని స‌మంత అభిమానులు ఇప్పుడు మాత్రం శోభిత‌పై చెల‌రేగిపోతున్నారు. అస‌లు శోభిత‌లో ఏం ప్లస్ పాయింట్స్ ఉన్నాయని చైతూ పెళ్లి చేసుకొంటున్నాడు అనే కోణంలో సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చే సాగుతోంది. హీరోయిన్ గా శోభిత ఫెయిల్ అయ్యింద‌ని, చివ‌రాఖరికి కండోమ్ యాడ్ లో కూడా న‌టించింద‌ని, పోయి పోయి అలాంటి అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకొంటున్నావంటూ స‌మంత ఫ్యాన్స్ చైతూపై ఫైర్ అవుతున్నారు. విడాకులు తీసుకొన్న వెంట‌నే చైతూ మ‌రో రిలేష‌న్ షిప్ మొద‌లెట్టాడ‌ని, ఇప్పుడు పెళ్లికి సైతం సిద్ధ ప‌డ్డాడ‌ని, స‌మంత మాత్రం ఇంకా ఒంట‌రిగానే ఉంటోంద‌ని, దీన్ని బ‌ట్టి చై – స‌మంత‌ల‌లో ఎవ‌రి ప్రేమ స్వ‌చ్ఛ‌మైన‌దో గుర్తించాల‌ని ప‌రోక్షంగా చైతూని త‌ప్పుప‌డుతున్నారు.అయితే శోభిత త‌ర‌పున మాట్లాడేవాళ్ళు కూడా త‌క్కువ‌గా ఏం లేరు. ఓ తెలుగ‌మ్మాయి, అంచెలంచెలుగా ఎదిగి, క‌థానాయిక అయ్యింద‌ని, అందాల పోటీల్లో కిరీటాలు గెలుచుకొంద‌ని, అలాంటి అమ్మాయిని త‌క్కువ చేసి మాట్లాడ‌టం భావ్యం కాద‌ని అంటున్నారు. ఓ వ్య‌క్తిగా శోభిత‌కు త‌న ప్రొఫెష‌న్ ను ఎంచుకొనే హక్కు ఉంద‌ని, న‌టిగా, మోడ‌ల్ గా త‌న‌కు న‌చ్చిన బ్రాండ్ ప్ర‌మోట్ చేస్తుంద‌ని, అది త‌న వృత్తి అని, ఇన్నాళ్లూ ఈ విష‌యంలో శోభిత‌ను ఎవ‌రూ త‌ప్పుప‌ట్ట‌లేద‌ని, ఇప్పుడే ఈప్ర‌శ్న‌లు ఎందుకు వ‌స్తున్నాయ‌ని నిల‌దీస్తున్నారు. ఒక‌సారి పెళ్లి ఫెయిల్ అయినంత మాత్రాన‌, జీవితం అక్క‌డే ఆగిపోకూడ‌ద‌ని, చై – శోభిత‌ను ట్రోల్ చేయ‌డం మానుకోవాల‌ని అక్కినేని అభిమానులు, శోభిత మ‌ద్ద‌తుదారులు గ‌ట్టిగానే గ‌ళం విప్పుతున్నారు. మొత్తానికి చైతూ - శోభిత వివాహ బంధం ద్వారా ఒక్కటిగా కాబోతున్న వేళ వారి వారి అభిమానుల్లో రచ్చ రేగుతుండటం ఉత్కంఠ ను కలిగిస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Take Oath As A TDP National Working President | CM Chandrababu | AG

తాజా వార్తలు

15-49-17-0617.jpg

మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం.. ఆర్టీజీఎస్ పై సమీక్షలో అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
2026-06-22 Time: 03:49:17

15-31-26-0626.jpg

ప్రజా ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టులు.. 4 అంశాలపై ప్రోగ్రెస్ రిపోర్టులను విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు
2026-06-22 Time: 03:31:26

17-02-16-0616.jpg

అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు.. చిన్నారులతో కలిసి రాగి జావ తీసుకున్న చంద్రబాబు
2026-06-20 Time: 05:02:16

14-06-28-0628.jpg

90వ రోజు ప్రజాదర్బార్.. వివిధ సమస్యలపై ప్రజల  వినతుల స్వీకరణ.. అన్నివిధాల అండగా ఉంటానట్టు  మంత్రి లోకేష్ హామీ
2026-06-16 Time: 02:06:28

14-04-35-0635.jpg

సెమీకండక్టర్ల తయారీకి ఏపీ బెస్ట్ డెస్టినేషన్.. సింగపూర్‌లో సెమీకండక్టర్లపై సెమీకాన్ ఎకోసిస్టమ్ సదస్సులో సీఎం చంద్రబాబు
2026-06-16 Time: 02:04:35

Related Videos