తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సీనియర్ నిర్మాత ఎం.అర్జునరాజు శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన వయసు 87 ఏళ్లు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే తెలుగు సినీ పరిశ్రమలో విషాద వాతావరణం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు, నిర్మాతలు, అభిమానులు ఆయన మరణంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అర్జునరాజు మృతి పట్ల తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ ఖామర్స్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సహా పలు సినీ సంఘాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. సినీ పరిశ్రమ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించాయి.

నిబద్ధతతో సినిమాలు నిర్మించిన నిర్మాతగా అర్జునరాజుకు ప్రత్యేక గుర్తింపు ఉందని సినీ ప్రముఖులు చెబుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యం ఇవ్వాలని కోరుతూ పలువురు సోషల్ మీడియాలో సంతాప సందేశాలు తెలియజేస్తున్నారు. ఆయన అంత్యక్రియలు ఇవాళ శనివారం సాయంత్రం  హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా అర్జునరాజు విశిష్ట స్థానం సంపాదించారు. రోజా మూవీస్ పతాకంపై కె.శివరామరాజుతో కలిసి ఆయన సినీ నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు. నందమూరి తారక రామారావు కథానాయకుడిగా తెరకెక్కిన ‘వేటగాడు’ చిత్రంతో నిర్మాతగా ఆయన ప్రయాణం ప్రారంభమైంది. ఆ సినిమా భారీ విజయాన్ని సాధించి అర్జునరాజుకు నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అదే చిత్రాన్ని హిందీలో ‘నిషానా’ పేరుతో రీమేక్ చేయడం కూడా విశేషం. ఆ తర్వాత ఎన్టీఆర్‌తోనే ‘కొండవీటి సింహం’ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించారు. కృష్ణ, కృష్ణంరాజు ప్రధాన పాత్రల్లో ‘అడవి సింహాలు’, శోభన్‌బాబుతో ‘కోడెత్రాచు’, చిరంజీవి హీరోగా ‘జేబుదొంగ’ వంటి సినిమాలను నిర్మించి భారీ విజయాలను అందుకున్నారు. అక్కినేని నాగార్జునతో ‘బావ నచ్చాడు’, శ్రీకాంత్, సిమ్రాన్ జంటగా ‘మా నాన్నకు పెళ్లి’ చిత్రాలను నిర్మించారు.

తెలుగుతో పాటు హిందీలో కూడా అర్జునరాజు పలు చిత్రాలను నిర్మించారు. ‘ఫర్జ్ ఔర్ కానూన్’, ‘జానీ దోస్త్’ వంటి హిందీ చిత్రాలను రూపొందించి నిర్మాతగా తన ప్రతిభను చాటుకున్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబం కూడా సినీ నిర్మాణ రంగంతో అనుబంధం కొనసాగిస్తోంది. అర్జునరాజు తనయుడు ఎం. రామలింగరాజు కూడా నిర్మాతగా ‘మా అల్లుడు వెరీ గుడ్’, ‘జగపతి’ వంటి చిత్రాలు నిర్మించి విజయాలు అందుకున్నారు. దశాబ్దాల పాటు సినీ పరిశ్రమలో సేవలందించిన అర్జునరాజు మరణం టాలీవుడ్‌కు తీరని లోటుగా సినీ వర్గాలు సంతాపం ప్రకటించాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos