సెలబ్రిటీల జాతకాలపై వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఇకపై జాతకాలు చెప్పనని కొద్ది రోజుల క్రితం ప్రకటించిన ఆయన, తాజాగా నటి ప్రగతి సాధించిన విజయంపై స్పందించారు. టాలీవుడ్ నటి ప్రగతి పవర్‌లిఫ్టింగ్‌లో సాధించిన పతకాల వెనుక తన పూజలే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నటి ప్రగతి ఇటీవల టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ & మాస్టర్స్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని ఏకంగా నాలుగు పతకాలు సాధించారు. దేశం గర్వించేలా విజయం సాధించిన ఆమెపై సినీ ప్రముఖులు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఈ విజయంపై వేణు స్వామి ఆసక్తికరంగా స్పందించారు. "నటి ప్రగతి వెయిట్ లిఫ్టింగ్‌లో గెలవాలని కోరుకుంటూ నా వద్దకు వచ్చి ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఆ పూజల ఫలితంగానే ఆమె పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి నాలుగు పతకాలు సాధించగలిగారని" వేణుస్వామి తెలిపారు. తన వాదనకు బలం చేకూరుస్తూ, ప్రగతి పూజల్లో పాల్గొన్నట్టుగా ఉన్న ఒక వీడియోను కూడా ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణుస్వామి మాట్లాడుతూ 'ఒక వ్యక్తి సక్సెస్ కావాలంటే విమర్శలు రావడం సహజం. ఏ రంగంలోనైనా ఎదుటివారిని టార్గెట్ చేయడానికి వంద మంది 200 చేతులతో రెడీగా ఉంటారు. నువ్వు వాళ్ల నుండి తప్పించుకోవాలంటే..  చాలా తెలివితో చాకచక్యంతో వ్యవహరించాలి. ప్రతి ఒక్కరు ఏదో ఒకచోట ఎదురు దెబ్బలు తినాల్సిందే. అవమానాలను దెబ్బలను తప్పించుకోవడానికి నేను ప్రయత్నిస్తా అంతే..' అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ తో ఇంటర్వ్యూ ప్రారంభించారు.

'చాలామంది సెలబ్రిటీ స్టేటస్ కావాలని, సినిమా అవకాశాలు రావాలని  భావిస్తుంటారు. నిజంగానే మీరు చెప్పినట్టు నిజ జీవితంలో పేరు ప్రఖ్యాతులు రావాలంటే పూజల వల్ల సాధ్యమా?' అని యాంకర్ ప్రశ్నించగా.. 'ఇటీవల నటి ప్రగతి   నా దగ్గరికి వచ్చింది. ఆమె మీ అందరికీ తెలిసిందే. ఆ నటి నా దగ్గరికి వచ్చి పూజలు చేయించుకుంది. ఆమె సినిమాల కోసం నా దగ్గరకు రాలేదు. గురువుగారూ ..నేను రెజ్లింగ్ లో గెలవాలని కోరుకుంటున్నానని నా దగ్గరికి వచ్చింది. రెజ్లింగ్ గెలవాలని ఆమె ప్రత్యేక పూజలు చేయించుకుంది. ఆ పూజల ఫలితమే ఈరోజు మెడల్స్ సాధించింది' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మాటలు విన్న నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos