డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్ కు తెలంగాణ హైకోర్టు లో భారీ ఊరట లభించింది. అతనిపై నమోదైన డ్రగ్స్ కేసును కోర్టు కొట్టివేస్తూ కీలక తీర్పు వెల్లడించింది. గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో నవదీప్ వద్ద ఎలాంటి డ్రగ్స్ స్వాధీనం కాలేదన్న వాదనతో కోర్టు ఏకీభవించింది. నవదీప్ తరఫున న్యాయవాది వెంకట సిద్ధార్థ్ వినిపించిన వాదనలను పరిశీలించిన న్యాయస్థానం, కేవలం ఎఫ్‌ఐఆర్‌లో పేరు చేర్చడమే తప్ప స్పాట్‌లో గానీ, ఇతర ఆధారాల్లో గానీ డ్రగ్స్‌కు సంబంధించిన రుజువులు లేవని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేసును కొట్టివేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు ప్రకటించింది.

ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పుడు నవదీప్ పేరు మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. హైదరాబాద్‌లో డ్రగ్స్ వినియోగం, సరఫరాకు సంబంధించిన విచారణలో భాగంగా గుడిమల్కాపూర్‌లో జరిగిన ఒక ఆపరేషన్ సమయంలో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఎఫ్‌ఐఆర్‌లో నవదీప్ పేరు చేర్చడంతో, అతను డ్రగ్స్ తీసుకుంటున్నాడన్న ఆరోపణలు, పరారీలో ఉన్నాడన్న కథనాలు సోషల్ మీడియా, టీవీ ఛానళ్లలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. దీంతో నవదీప్ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లిందని ఆయన సన్నిహితులు అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వార్తలపై స్పందించిన నవదీప్, డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. తనను అనవసరంగా ఈ కేసులో ఇరికించారని, తాను ఎప్పుడూ డ్రగ్స్ వినియోగించలేదని వెల్లడించారు. పోలీసులు తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న భయంతో, ముందస్తు రక్షణ కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు, నవదీప్‌ను అరెస్ట్ చేయవద్దని తొలుత మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం కేసు వివరాలను పూర్తిగా పరిశీలించిన కోర్టు.. డ్రగ్స్ స్వాధీనం కాలేదన్న అంశాన్ని కీలకంగా పరిగణనలోకి తీసుకుంది.

న్యాయవాది వెంకట సిద్ధార్థ్ వాదనల ప్రకారం, నవదీప్ పేరు కేవలం ఎఫ్‌ఐఆర్‌లో మాత్రమే ఉంది తప్ప, అతని వద్ద నుంచి ఎలాంటి నిషేధిత పదార్థాలు లభించలేదని, ప్రత్యక్ష ఆధారాలు లేవని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ వాదనలను సమగ్రంగా పరిశీలించిన న్యాయస్థానం, కేసును కొనసాగించడానికి సరైన ఆధారాలు లేవని తేల్చి, డ్రగ్స్ కేసును పూర్తిగా కొట్టివేసింది. దీంతో గత కొంతకాలంగా కొనసాగుతున్న అనిశ్చితి నుంచి నవదీప్ బయటపడ్డాడు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos