ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ చిత్రం హరి హర వీరమల్లు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ మూవీ ఈ నెల 24న అడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇందులో కథానాయికగా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతుండగా.. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ శిల్పా కళా వేదికలో హరి హర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనుంది చిత్రయూనిట్. ఈ క్రమంలో ఇవాళ ఉదయం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమాకు సంబంధించి అనేక విషయాలు పంచుకున్నారు.

“ సినిమా బతకాలి అన్న ఒక్క ఉద్దేశ్యంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను. నా జీవితంలో సినిమాపరంగా మీడియాతో మాట్లాడడం ఇదే తొలిసారి. సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు. ఇందుకు చాలా కష్టపడ్డాం అని చెప్పడం నాకు మొహమాటంగా ఉంటుంది. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నా ఫోటోస్ పేపర్ లో వేయలేదు. దీంతో పబ్లిసిటీ లేకుండానే సినిమాలు విడుదల అయ్యాయి. సినిమాల గురించి నాకు ఏం మాట్లాడాలో తెలియదు. సినిమాల్లో నటించడం మాత్రమే తెలుసు.. ఎలా ప్రమోట్ చేసుకోవాలో తెలియదు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం నిర్మాత ఏఎం రత్నమే. సినిమా నిర్మించాలంటే ఎన్నో యుద్ధాలు చేయాలి. ఈ చాలా ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమాకు టైం ఇవ్వలేదు. అయినా నాకు బెస్ట్ మూవీ ఇచ్చారు. గతంలో నేను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ కు చాలా పనికి వచ్చింది. ఈ సినిమాకు క్లైమాక్స్ అనేది అదే ఆయువు పట్టు అయిందని" పవన్ కళ్యాణ్ అన్నారు.

క్రిష్ చాలా మంచి కాన్సెప్టుతో ముందుకు వచ్చారు. ఆయనకు మా టీమ్ అందరి తరపున కృతజ్ఞతలు. ఈ మూవీ కోసం నిర్మాత ఎంతో నలిగిపోయారు. ఈ సినిమాకు కీరవాణి ప్రాణం పోశారు. మండుటెండల్లో 57 రోజులు క్లైమాక్స్ షూట్ చేసాం. చాలా కాలం తర్వాత మళ్లీ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేశాను. ఈ క్లైమాక్స్ అందరికి నచ్చుతుంది. ఈ మూవీ కోసం నిర్మాత ఎదుర్కొన్న కష్టాలు చూసి ఈ ప్రాజెక్ట్ చేయాలనుకున్నా.. నిర్మాత కనుమరుగు కాకూడదనే ఉద్దేశ్యంతో ఈవిధంగా చేశానని” పవన్ కళ్యాణ్ అన్నారు.

అలాగే సినీ పరిశ్రమ గురించి మాట్లాడుతూ.. "కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా.. ప్రతిభ ఉంటే ఎవరైనా సినీ రంగంలో రాణించవచ్చు. చిరంజీవి గారి తమ్ముడు కావచ్చు, చిరంజీవి గారి కొడుకు కావచ్చు.. నువ్వు ఎవరనేది విషయం కాదు. నీకు టాలెంట్ లేకుండా ఇక్కడ నిలబడలేవు. అది నాకొడుకైనా సరే." అని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కష్టాలు, అవమానాలు కామన్ అని.. టాలెంట్ లేకపోతే ఇక్కడ నిలబడలేమని తన అనుభవంతో చెప్పినట్లు అర్థమవుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos