సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. సింగర్ ఎస్. జానకి కుమారుడు మురళీకృష్ణ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 65 సంవత్సరాలు. మురళీకృష్ణ మృతిపై సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మురళీకృష్ణకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మురళీకృష్ణ మృతిపై సింగర్ చిత్ర భావోద్వేగ పోస్ట్ చేశారు. ఈ బాధకరమైన సమయంలో జానకి అమ్మకు దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని.. తాను ఎంతో ప్రియమైన సోదరుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు.

"ఈ రోజు ఉదయం మురళీ అన్న ఆకస్మిక మరణవార్త విని నేను షాకయ్యాను. మేము ఒక ప్రేమగల సోదరుడిని కోల్పోయాము. ఈ భరించలేని బాధను దుఃఖాన్ని అధిగమించేందుకు దేవుడు అమ్మకు శక్తిని ప్రసాదించుగాక.. మరణించిన ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలి. ఓం శాంతి" అంటూ రాసుకొచ్చారు సింగర్ చిత్ర.

సింగర్ జానకి తనయుడు మురళీకృష్ణ భరతనాట్యంలో ప్రావీణ్యం కలిగినవారు. పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అనుక్షణం కంటికి రెప్పలా చూసుకునే ఒక్కగాని ఒక్క కొడుకు దూరమవడంతో జానకి గారి కుటుంబంలో తీరని లోటు ఏర్పడింది. ఇక సింగర్ జానకి సినీప్రస్థానం విషయానికి వస్తే.. ఇప్పటివరకు ఆమె దాదాపు 50 వేలకుపైగా పాటలు పాడారు. సినీరంగంలో దాదాపు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos