తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు, మాటల రచయిత ఏఎస్ రవికుమార్ చౌదరి కన్నుమూశారు. గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం గుంటూరు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆయన మరణించినట్లు తెలుస్తోంది. 1995లో విడుదలైన అమ్మదొంగ సినిమాతో ఆయన టాలీవుడ్ లో అడుగు పెట్టారు. ఆ సినిమా దర్శకుడు సాగర్ వద్ద అసిస్టెంట్ గా చేరారు. 2004లో యజ్ఞం సినిమాతో గోపీచంద్ ను హీరోగా తెలుగు తెరకు పరిచయం చేశారు. అప్పటివరకు విలన్ పాత్రల్లో నటించిన గోపీచంద్ కు హీరోగా ఈ మూవీ బ్రేక్ ఇచ్చింది. దర్శకుడిగా రవికుమార్ చౌదరికీ ఇదే తొలి చిత్రం.

రెండో ప్రయత్నంలోనే నందమూరి బాలకృష్ణ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం లభించింది. వీరభద్ర సినిమాకు దర్శకత్వం వహించారు గానీ అది డిజాస్టర్ గా నిలిచింది. బాలయ్య నటించిన సినిమాల్లో బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీల్లో అదీ ఒకటి. ద్వితీయ విఘ్నం నుంచి తప్పించుకోలేకపోయారు. ఆ తరువాత నితిన్ తో అటాడిస్తా సినిమా తీసినా దాని ఫలితం కూడా అంతంతమాత్రమే. ఆ తరువాత సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నారు. 2014లో పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఇది యావరేజ్ గా నిలిచింది. దాని తరువాత మళ్లీ గోపీచంద్ తో సౌఖ్యం సినిమా తీశారు. అది ఫ్లాప్ కావడంతో ఇక దాదాపుగా చిత్ర పరిశ్రమకు దూరం అయ్యారు. చివరిగా 2024లో తిరగబడర సామి సినిమాకు కథను అందించారు. ఇక అంతే.   అప్పటినుంచి ఇక సినిమాల ఊసే ఎత్తలేదు ఎత్తలేదు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos