యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది, టాలీవుడ్ యువ నటుడు నార్నే నితిన్ ఒక ఇంటివాడయ్యారు. శివానీ అనే యువతితో ఆయన వివాహం శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ శివారులోని శంకర్‌పల్లిలో జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ పెళ్లిలో జూనియర్ ఎన్టీఆర్ తన సతీమణి లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లతో కలిసి పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వధువు శివానీ నెల్లూరు జిల్లాకు చెందిన వెంకట కృష్ణ ప్రసాద్, స్వరూప దంపతుల కుమార్తె. ఆమె కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. అంతేకాకుండా ఆమె టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేశ్‌కు బంధువుల అమ్మాయి కావడం విశేషం. దీంతో ఈ వివాహం సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. గత ఏడాది నవంబర్ 3న నితిన్, శివానీల నిశ్చితార్థం హైదరాబాద్‌లో జరగ్గా, ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. "మ్యాడ్" సినిమాతో 2023లో హీరోగా పరిచయమైన నార్నే నితిన్, తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత "ఆయ్", "మ్యాడ్ స్క్వేర్" వంటి చిత్రాలతో వరుస విజయాలు అందుకుని ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇటీవలే "శ్రీశ్రీశ్రీ రాజావారు" సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం నితిన్-శివానీల పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ నెటిజన్లు, అభిమానులు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. దీంతో #NarneNithinWedding అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos