ఏపీలో ఎన్నికల పోరు హోరా హోరీగా మారుతోంది. టీడీపీ, జనసేన తమ తొలి జాబితా ప్రకటించాయి. రెండో జాబితా విడుదలకు టిడిపి అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే రెండు పార్టీల నుంచి 99 మంది అభ్యర్దులను ప్రకటించారు. ఈ క్రమంలో తొలి జాబితాలో సీట్లు దక్కక అసంతృప్తిగా ఉన్న సీనియర్లతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేమై... భవిష్యత్ పైన హామీ ఇచ్చారు. ఇప్పుడు రెండో జాబితాలో బీసీ, మైనార్టీ వర్గాలకు సీట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ పొత్తు ఖాయమైతే ఆ పార్టీకి ఏ సీట్లు ఇస్తారనేది ఇప్పుడు ఈ రెండు పార్టీల్లో ఆసక్తికరంగా మారుతోంది. మూడు పార్టీల మధ్య సమన్వయం, ఓట్ల బదిలీ జరిగేలా నిర్ణయాలు ఉండాలని భావిస్తున్నారు. బీజేపీ తో పొత్తు తేలిన వెంటనే మూడు పార్టీలు కలిసి మరో జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ మరింత ఆలస్యం చేస్తే చంద్రబాబు, పవన్ తమ రెండో జాబితా విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో, రెండు పార్టీల ఆశావహుల్లో రెండో జాబితా పైన ఆసక్తి కనిపిస్తోంది. కాగా... బీజేపీ తమతో కలిసి వస్తుందనే సంకేతాలు కనిపిస్తున్నా..అధికారికంగా స్పష్టత రాలేదు. మరోవైపు పవన్ కల్యాణ్ తాను పోటీ చేసే స్థానం పైన రెండో జాబితాలో స్పష్టత ఇవ్వనున్నారు. భీమవరం నుంచి పవన్ పోటీ చేస్తారని ప్రచారం సాగినా..పిఠాపురం నుంచి బరిలోకి దిగుతారని చెబుతున్నారు. గోదావరి జిల్లాలతో పాటుగా విశాఖ జిల్లాలో పవన్ ఎక్కువ సీట్లు కోరుకుంటున్నారు. దీంతో..తొలి జాబితాలో టీడీపీ నుంచి పలువురు సీనియర్ల సీట్లు పెండింగ్ లో ఉన్నాయి. పొత్తులో భాగంగా కొన్ని సీట్లు జనసేనకు ఖాయమయ్యాయి. మొత్తానికి రెండు రోజుల్లో ... ఎవరెవరు ఏ స్థానాల్లో పోటీ చేస్తారా చేస్తారనే వివరాలను రెండు పార్టీల అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos