రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మార్పు చేసేందుకు పది రంగాలు, పది సూత్రాలతో ముందుకు సాగనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. దీనికోసం నిర్ధిష్టమైన కార్యాచరణను రూపొందించినట్లు ఆయన చెప్పారు. స్వర్ణాంధ్ర విజన్‌ 2047 యాక్షన్‌ ప్లాన్‌ యూనిట్లను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా, నియోజకవర్గాల వారీగా యూనిట్ల కార్యాలయాలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ప్రభుత్వ కార్యాలయాలు లేవని, ఇప్పుడు యూనిట్‌ కార్యాలయాల ద్వారా ఆ లోటు కూడా తీరుతున్నట్లు వెల్లడించారు. విజన్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు పది రంగాల్లో ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ఇప్పటికే ఐదేళ్ల కాలానికి అన్ని జిల్లాలకు రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా 400 వరకు సేవలు అందిస్తున్నామని, వచ్చే రెండు నెలల్లో మొత్తం ప్రభుత్వ సేవలను మనమిత్ర ద్వారా ఉండవచ్చునని చంద్రబాబు చెప్పారు.

నియోజకవర్గ యాక్షన్‌ యూనిట్‌కు ఎమ్మెల్యే అధ్యక్షునిగా ఉంటారని, స్థానిక సంస్థలకు, కూడా అధ్యక్షులను నియమించామని పేర్కొన్నారు. ఈ యూనిట్ల ద్వారా అభివృద్ధి సాధించేందుకు ఎమ్మెల్యేలకు ఇది మంచి అవకాశమన్నారు. అలాగే వచ్చే రెరడేళ్లలో మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదుగుతుందని అన్నారు.  వచ్చే ఆగస్టు 15వ తేదీ నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రిఫరల్‌ విధానం ద్వారా మరింతమంది మార్గదర్శకులను పరిచయం చేసే అధికారులకు అవార్డులు కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అలాగే అమరావతిలో రతన్‌ టాటా హబ్‌లు ఏర్పాటు చేసేందుకు, ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఇ పార్కులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు వివరించారు. ఆదాయం పెరిగితే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేయగలమని, దీనికోసం టెక్నాలజీని కూడా అనుసంధానం చేస్తున్నామని చెప్పారు.

అమలు చేయనున్న 10సూత్రాలు ఇవే..

1.పేదరికం లేని సమాజం 2. ఉద్యోగాల కల్పన 3. మానవ వనరుల అభివృద్ధి, 4. నీటి భద్రత 5., వ్యవసాయ సాంకేతికత 6. అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్‌ 7. ఇంధన వనరుల వినియోగం 8. నాణ్యమైన ఉత్పత్తుల తయారీ 9. స్వచ్ఛాంధ్ర 10. డీప్‌ టెక్‌

అమలు చేయనున్న 10రంగాలు ఇవే..

1.వ్యవసాయం, 2. పాడిపరిశ్రమ, 3.పరిశ్రమలు, 4. సేవలు , 5. వైద్య ఆరోగ్య సౌకర్యాలు, 6. విద్య, నైపుణ్యాభివృద్ధి, 7. పర్యావరణం, 8. మౌళిక వసతుల కల్పన 9, పట్టణ, గ్రామీణాభివృద్ధి, 10 పాలనా సామర్థ్యం

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos