స్పెషల్ నీడ్స్ పిల్లలు ఇంట్లో ఉన్నపుడు తల్లిదండ్రులు అనేక సమస్యలు ఎదుర్కొంటుంటారు, వారి అవసరాలను ఆసరాగా తీసుకొని ప్రైవేటు సంస్థలు రూ.50వేలు కూడా వసూలు చేస్తున్నాయని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి లోకేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ మాట్లాడుతూ... స్పెషల్ నీడ్స్ పిల్లలకు టీచర్ అండ్ స్టూడెంట్ రేషియోను మెయింటైన్ చేయాలని, దీనివల్ల వారి కాళ్లపై వాళ్లను నిలబట్టడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు.

ఈ విషయంపై మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఏర్పాటుచేసి, 21 రకాల దివ్యాంగుల్లో 9 రకాల వారికి స్పెషల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని నిర్ణయించిందని, వీరి కోసం ఏపీలో 679 భవిత సెంటర్లు నిర్వహిస్తున్నామని, ప్రతి సెంటర్ కు ఇద్దరు ఐఇఆర్ ల చొప్పున 1358 మంది టీచర్లు ఉన్నారని, ఈ సెంటర్లలో 41,119 మంది రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. కేంద్రబడ్జెట్ లో కేటాయించిన నిధుల మేరకు 2025-26కు గాను ప్రతి మున్సిపాలిటీకి ఒక సెంటర్ చొప్పున మరో 125 కొత్త సెంటర్ల కోసం ప్రతిపాదనలు ఉన్నాయని నారా లోకేష్ తెలిపారు. వీటికి 100 శాతం నిధులు మంజూరవుతాయని బలంగా నమ్ముతున్నాం. టీచర్ – స్టూడెంట్ రేషియో ప్రకారం ప్రైమరీలో 1:10 (10 మంది విద్యార్థులకు ఒక టీచర్), సెకండరీలో 1: 15 (15 మంది విద్యార్థులకు ఒక టీచర్) ఉండాలి. సెకండరీలో ఇంకా రిక్రూట్ మెంట్ చేయాల్సి ఉంది. పిల్లలను, వారి కుటుంబాలను ఆదుకోవాలనే లక్ష్యంతో ఉన్నాం. సభ్యులతో ఒక కమిటీ వేసి కొత్త టెక్నాలజీ, టీచింగ్ పై చర్చించి నిర్ణయం తీసుకుంటామని’ మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos