నవ్యాంధ్ర రాజధాని అమరావతిని విచ్ఛిన్నం చేయాలని ఎన్నో శక్తులు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు అమరావతి స్థల మహత్యమో, ప్రకృతి వరమో తెలియదుగానీ అమరావతి మునిగిపోవాలన్న కొందరి కలలు కల్లలుగానే మిగిలిపోతున్నాయి. అమరావతి నీట మునిగిందంటూ దుష్ప్రచారానికి దిగిన వారికి తెలుగు ప్రాంత ప్రజలు ముఖ్యంగా ఆ ప్రాంతవాసులు గట్టిగా సమాధానమిస్తున్నారు. ఏ సోషల్ మీడియా వేదికగా, పత్రికల్లో, టీవీల్లో వాస్తున్న వార్తలను అదేవిధంగా తిప్పికొడుతున్నారు. రాజధానికి అత్యంత అనువైన, సురక్షితమైన ప్రాంతామని నెటిజన్లు తెలుపుతున్నారు. గత 5 సంవత్సరాలు రాజధానిని పట్టించుకోకుండా, ఇప్పుడు మళ్లీ అమరావతి గురించి చెడ్డ ప్రచారం చేస్తున్న వారిని అడ్డుకుంటున్నారు. మునిగిపోయింది అన్న వారికి వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ దీటుగా సమాధానమిస్తున్నారు.
నవ్యాంధ్ర రాజధానిని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న కుయుక్తులను పసిగట్టి పాతరేస్తున్నారు. అమరావతికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ మహానగరం వరద ముంపునకు గురయింది. గుంటూరులోనూ భారీవర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో వైసీపీ అమరావతి మునిగిపోయిందంటూ ప్రచారం మొదలుపెట్టింది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా ఉంది. హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ భవనాలను నిర్మించే కోర్ క్యాపిటల్ ప్రాంతం ... ఇలా ఇవన్నీ అక్కడ అత్యంత సురక్షితంగా ఉన్నాయి. రాజధాని గ్రామాల్లో వర్షం కారణంగా నిలిచిన నీరు తప్ప ఎక్కడా వరద ఆనవాలు లేదు.
రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించే సమయంలోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది. రాజధాని గ్రామాల్లో ముంపునకు కారణమయ్యేందుకు ఉన్నది కేవలం కొండవీటి వాగేనని గుర్తించింది. దాని ముంపు నుంచి రాజధానిని రక్షించేందుకు అప్పట్లోనే చర్యలు చేపట్టింది. అత్యధిక వరద వచ్చినప్పుడు సమస్య తలెత్తకుండా లిఫ్టులను ఏర్పాటు చేసింది. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ లిఫ్టులను వాడకుండా కొండవీటి వాగు వరద నీటితో అమరావతిని ముంపు బారిన పడేలా చేయాలని ప్రయత్నించిందన్న ఆరోపణలు ఉన్నాయి. రాజధానికి భూ సేకరణకు ముందు ఆ ప్రాంతంలో కొండవీటి వాగు వరద సమస్య సృష్టిస్తూ ఉండేది. కానీ టీడీపీ ప్రభుత్వం దాని వరద కోసం ప్రత్యేకంగా ఎత్తిపోతల పధకం ఏర్పాటు చేయడంతో ఈసారి ఆ వాగు ప్రవాహం సాఫీగా వెళ్లిపోయింది.
రాజధాని ప్రాంతానికి, నదికి మధ్యలో పెద్ద కరకట్ట అడ్డుగా ఉంది. వరద నీరు దాని వరకూ వచ్చి ఆగిపోయింది. ఆ రెంటి మధ్యలో ఉన్న కొన్ని భవనాలు మాత్రం కొంత మేర ముంపునకు గురయ్యాయి. మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి ఆశ్రమం నది ఒడ్డునే ఉంది. దానిలోకి నీళ్లు వచ్చాయి. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం నివాసం ఉంటున్న అద్దె ఇల్లు కూడా నదిని ఆనుకునే ఉంటుంది. ఆ ఇంటి ప్రహరీ గోడను తాకుతూ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ఇంటి ఆవరణలోకి కూడా స్వల్పంగా నీళ్లు వచ్చాయి. కానీ కరకట్టను దాటి మాత్రం ప్రవేశించలేదు.
అయితే చంద్రబాబు ఇల్లు మనగలేదని వైసీపీ అధినేత జగన్ కుళ్లిపోతున్నారని ఎవరికైనా అర్థం అవుతుంది. చంద్రబాబు ఉంటున్న ఇల్లు అక్రమ కట్టడం అని ఆయన పదేపదే చెబుతూ వస్తున్నారు. తన హయాంలో ఎన్ని కుట్రలు చేయాలో అన్నీ చేశారు. చంద్రబాబు ఇంటికి నోటీసులు ఇచ్చారు. అయితే ఇప్పుడు 120 ఏళ్లలో రానంత వరద వచ్చినా.. చంద్రబాబు ఇంటి సమీపానికి నీరు వచ్చిందే తప్ప ఆ ఇల్లు ముంపునకు గురి కాలేదు. దీంతో జగన్ ఏడుపు పతాక స్థాయికి చేరుకుంది.
చంద్రబాబు ఇల్లు ఎందుకు మునగలేదంటే బుడమేరు వాగులో నీళ్లు మళ్లించారని.. గేట్లేశారని జగన్ ప్రవచనాలు చెబుతున్నారు. బుడమేరు గురించి ఆయన చెప్పిన కథ విని… ఈ పిచ్చికి మందు లేదని అనుకునేవారు ఎక్కువయ్యారు. చివరికి వైసీపీ నేతలు కూడా తమ పరువు పోయిందని అనుకోవడం తప్ప ఏమీ చేయలేరు. చంద్రబాబు ఇల్లు మునగకపోవడానికి ఆయన ఏదో ఒక కారణం చెప్పాలనుకున్నారు చెప్పారు. అంతే అది ఫేకా.. రియలా అని పట్టించుకునే పరిజ్ఞానం జగన్ కు లేదని అన్ని వర్గాల్లోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆయనలో ఇంత దారుణమైన కుళ్లు, కుతంత్రాలు ఉండటం.. అందరూ తనను చూసి నవ్వుతారని తెలిసినా.. కాన్ఫిడెంట్ గా అవే మాటలు చెప్పడం జగన్ లాంటి వారికే సాధ్యం. వీరు అసాధారణమైన మానసిక వికృతంతో బాధపడుతూంటారు. వీరికి ఎంత దూరంగా ఉంటే.. ఆ చుట్టుపక్కల ఉండేవారికి అంత మంచిదని అభిప్రాయాలు వెలువడుతున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos