ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును దూషించిన కేసులో మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది గుంటూరు మొబైల్ కోర్ట్. దీంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలు కు తరలించారు. అంతకు ముందు అంబటికి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అంబటికి  ఒక కేసులో మాత్రం అంటే పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన కేసులో మాత్రం స్టేషన్ బెయిల్ లభించింది. కానీ సీయంపై అనుచిత వ్యాఖ్యల కేసులో మాత్రం కోర్టు పోలీసుల వాదనతో ఏకీభవించింది. దానితో ఆయనకు 14 రోజుల రిమాండ్ ను విధించారు.

అంబటిపై రాష్ట్రవ్యాప్తంగా  16 క్రిమినల్ ఫిర్యాదులు నమోదయ్యాయని రిమాండ్ రిపోర్టులో వెల్లడించిన పోలీసులు అయన  ప్రస్తుత పరిస్థితుల్లో బయట ఉంటే ప్రాణహాని కలిగే అవకాశం ఉందని కాబట్టి కొంతకాలం రిమాండ్ లో ఉంచాలని కోరారు. అలాగే మాజీ మంత్రి రాంబాబు పదేపదే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, సమాజంలో ఉద్రిక్తతలు పెంచడమే లక్ష్యంగా అంబటి తీరు  ఉందని సీఎం చంద్రబాబుపై అత్యంత అసభ్య పదజాలంతో దూషణలు చేసారని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు  నల్లపాడు పోలీసులు. రెండు వర్గాల మధ్య వైషమ్యాలు పెంచి, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న అంబటిని బయట వదిలేస్తే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే ప్రమాదం ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు.  అంబటిని అరెస్ట్ చేయని పక్షంలో, రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు చెలరేగే చాన్స్ అవకాశం ఉందన్న పోలీసులు 14 రోజుల రిమాండ్‌తో పాటు పోలీసు కస్టడీ కి సైతం అంబటి ని అప్పగించాలని కోరారు  పబ్లిక్ ప్రాసిక్యూటర్లు. అంబటి రాంబాబు ఉద్దేశ పూర్వకం గానే ముఖ్యమంత్రిఫై దుర్భాషలాడారని  డానికి సంబందించిన వీడియో ను కోర్టులో ప్రెజెంట్ చేసారు అంబటి ఫై నమోదైన కేసులు రుజువైతే 7 ఏళ్ల పైన శిక్షలు పడే అవకాశం ఉంది కాబట్టి ఆయనకు రిమాండ్ విధించడంతో పాటు విచారణ కోసం తమ కస్టడీకి కూడా ఇవ్వాలని పోలీసులు తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ లు కోరారు.

అంబటి రాంబాబు కోర్టులో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన వయస్సు దృష్ట్యా రిమాండ్ వద్దని బెయిల్ ఇవ్వాలని కోరారు. 68 ఏళ్ల వయస్సు లో తనను అరెస్ట్ చేసి పోలీసులు టార్చర్ చేసినట్టు చెప్పారు. కోర్టు లో కూడా అంబటి తాను ముఖ్యమంత్రి ఫై అలా మాట్లాడి ఉండవలసింది కాదని విచారం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ని కాబట్టి తనకు ప్రత్యేక వసతులు కావాలని కోరగా దానికి అనుమతి దొరకలేదు. తన అనారోగ్యం దృష్ట్యా మెడిసిన్ మాత్రం ఇంటినుండి తెచ్చుకోవడానికి అనుమతించారు. అంతకుముందు అంబటి రాంబాబు న్యాయవాది మాధవిని మాత్రమే కలవడానికి ఆయన్ను పోలీసులు అనుమతించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos