మాజీ మంత్రి జోగి రమేష్ పైన మరో కేసు రిజిస్టర్ అయింది. మంత్రి నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలతో పాటు కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా జోగి రమేశ్‌ వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు చేశారు. ఈ మేరకు రమేశ్‌పై పలు సెక్షన్ల కింద ఇబ్రహీంపట్నం పోలీసులు కేసులు నమోదు చేశారు. మరోవైపు జోగి రమేశ్ నివాసంపై దాడి కేసులోనూ పలు సెక్షన్ల కింద పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. ఇక జోగి నివాసంపై దాడిని పరిశీలించేందుకు వెళ్తుండగా జరిగిన అరెస్టులపై సైతం కేసులు నమోదు చేశారు పోలీసులు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్, నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, మాజీ ఏఎంసీ ఛైర్మన్ మస్తాన్, శ్రీనివాసరావులపై కేసు నమోదు చేశారు. కాగా, జోగి రమేశ్ నివాసంపై దాడి కేసులో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా సుమోటోగా తీసుకుని ఇబ్రహీంపట్నం ఎస్ఐ సత్యవతి కేసు నమోదు చేశారు. జోగి రమేశ్ నివాసంపై దాడి కేసులో టీడీపీ కార్యకర్తలు కాకి నాగరాజు, గణపతి, మేసిపాము బాబూరావుల పేర్లు నమోదయ్యాయి.

కాగా, దాడి సమయంలో తిరుపతిలో ఉన్న జోగి రమేష్ అక్కడి నుంచి తిరిగి నివాసానికి చేరుకున్న తర్వాత వైసీపీ నేత మొండితోక జగన్మోహన రావు ఆయన్ను కలిసారు.   జగన్మోహన రావుతో అర్ద్రరాత్రి 1.30 గంటలకు సమావేశం అయ్యారు. జోగి రమేష్ ప్రస్తుతం తన నివాసంలోనే పార్టీ శ్రేణులతో సమావేశం అయ్యారు. ఇదే సమయంలో జోగి రమేష్ ఇంటి వద్ద పోలీసులు భారీగా బందో బస్తు ఏర్పాటు చేసారు. అటు జోగి రమేష్ ఇంటి పైన దాడి జరగటంతో మాజీ సీఎం జగన్ ఫోన్ చేసి మాట్లాడారు. దాడుల పైన జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos