ఏపీని మరో తుఫాన్ గండం భయపెడుతోంది. దక్షిణ అండమాన్ సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ రేపు మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే తదుపరి 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇది తుపానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో, రానున్న నాలుగు రోజుల్లో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలపై అప్రమత్తం చేసింది.

ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం నాటికి నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న కారణంగా సోమవారం ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. కాగా, అల్పపీడన ప్రభావంతో గత మూడు రోజుల నుంచి కడపలో ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. తుపాన్​ ఉందని అధికారులు వెల్లడించడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కాగా ఈ వాయుగుండం ప్రభావంతో చలి తీవ్రత తగ్గింది.

27వ తేదీకల్లా ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫాన్‌గా బలపడనుందని వాతావరణ శాఖకు చెందిన కొందరు నిపుణులు చెబుతుండగా, మరికొన్ని మోడళ్ల మేరకు దిశ మార్చుకుని బంగ్లాదేశ్‌ వైపు వెళ్తుందని అంచనా వేస్తున్నారు. ఇదిలావుండగా శ్రీలంక సమీప కామరూన్‌, నైరుతి బంగాళాఖాతంలో ఈ రోజు సోమవారం మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో కోస్తా ప్రాంతంలో వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలోనూ హైదరాబాద్ తో సహా పాలు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మొంథా తుఫాను తీవ్రత నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే తాజా తుఫాను హెచ్చరికలు రైతులను ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే, ప్రస్తుతం తుఫాను గమనం పైన అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. ఏపీ రాష్ట్రంపై దీని ప్రభావం ఉంటుందా లేదా అనేది స్పష్టత రాగానే చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos