ఏపీ పారిశ్రామిక ప్రగతిలో మరో కీలక ముందడుగు పడింది. దేశంలోనే మొట్టమొదటి అమోర్ఫస్ ఎలక్ట్రికల్ స్టీల్ ప్లాంట్‌ను ఏపీలో ఏర్పాటు చేయనున్నారు. అమెరికా-జపాన్ దేశాలకు చెందిన ప్రొటీరియల్ అనే సంయుక్త సంస్థ ఈ ప్రాజెక్టును తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో స్థాపించనుంది. రూ.1350 కోట్ల భారీ పెట్టుబడితో ‘మెట్‌గ్లాస్‌ ఇండియా’ పేరుతో ఈ ప్లాంట్‌ను నిర్మించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ స్టీల్ ప్లాంట్‌ను ప్రొటీరియల్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయనున్నారు. ఇక్కడ అత్యాధునిక జపాన్ టెక్నాలజీని ఉపయోగించి అల్లాయ్ రిబ్బన్‌ను ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా సుమారు 200 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తొలిదశలో ఏటా 30 వేల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేసి, కార్యకలాపాలు ప్రారంభిస్తామని ప్రొటీరియల్ సంస్థ సీఈవో శాన్‌స్టాక్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, అందిస్తున్న ప్రోత్సాహకాల వల్లే తాము ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ స్టీల్ ప్లాంట్ రాకతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని భావిస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos