ఏపీ ప్రభుత్వం పెట్టుబడులపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలు సంస్థలు పెట్టబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకోగా.. కొందరు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. అయితే తాజాగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ ముందుకు వచ్చింది. జపాన్‌కు చెందిన ప్రముఖ ఏసీల తయారీ కంపెనీ డైకిన్ రాష్ట్రంలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి పెడుతోంది. తిరుపతి సమీపంలోని శ్రీ సిటీలో డైకిన్ ఇండస్ట్రీస్‌ రూ.వెయ్యి కోట్లతో కంప్రెసర్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. తైవాన్‌కు చెందిన రెచి ప్రెసిషన్‌ భాగస్వామ్యంతో రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. డైకిన్‌ ఇండియా, రెచి ప్రెసిషన్‌ కలిసి ఇన్వర్టర్, నాన్‌ ఇన్వర్టర్‌ ఏసీలలో వినియోగించే రోటరీ కంప్రెసర్లను తయారుచేసి.. విదేశాలకు ఎగుమతి చేయనున్నాయి. ఈ ప్రాజెక్టులో డైకిన్‌ మెజారిటీ భాగస్వామిగా ఉండనుంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఈ ప్లాంట్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. డైకిన్ రెచి ప్రెసిషన్‌లు శ్రీసిటీలో ఏర్పాటు చేయబోతున్న ఈ యూనిట్ 75 ఎకరాల్లో నిర్మించనున్నారు. ఈ యూనిట్ ఆగ్నేయాసియాలోనే అతి పెద్దదని చెబుతున్నారు. ప్రస్తుతం డైకిన్ దేశవ్యాప్తంగా 2 మిలియన్‌ యూనిట్లను తయారు చేస్తుండగా.. ఆ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచాలని భావిస్తోంది. ఈ మేరకు 2030 నాటికి 5 మిలియన్‌ యూనిట్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశీయ మార్కెట్‌లో ఏసీ విక్రయాల్లో మెజారిటీ వాటా దక్కించుకోవాలన్నదే తమ ఆలోచన అని చెబుతోంది డైకిన్. 

ఏపీలో యూనిట్ ఏర్పాటు చేయడానికి చేసుకున్న ఈ ఒప్పందం వల్ల దేశీయంగా మధ్యతరగతి జనాలకు అతి తక్కువ ధరకే ఏసీలను అందించడం సాధ్యం అవుతుందని భావిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. డైకిన్ మాత్రమే కాదు శ్రీసిటీలో పలు సంస్థలు ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఎంతోమందికి ఉపాధి కూడా దక్కుతోంది. డైకిన్ యూనిట్ ఏర్పాటైతే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వారికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని భావిస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos