ఏపీ రాజధాని కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. రెండో విడత భూ సమీకరణతో పాటు గా అమరావతిలో కొత్త నిర్ణయాలు అమలు అవుతున్నాయి. అటు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అమరావతికి రాజధానిగా చట్టబద్దత కల్పిస్తూ బిల్లు ప్రవేశపెట్టేందుకు రంగం సిద్దమైంది. కాగా.. ఇప్పుడు రెండో దశ మాస్టర్ ప్లాన్ రూపకల్పన కోసం సీఆర్డీఏ బిడ్లు ఆహ్వానించింది. సింగపూర్ సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయి. ఫిబ్రవరి 6వ తేదీ గడువుగా నిర్ణయించారు. రెండోదశ మాస్టర్ ప్లాన్ రూపకల్పన కన్సల్టెంట్ ను ఖరారు చేసేందుకు సీఆర్డీఏ టెండర్లను పిలిచింది. తొలి దశలో సింగపూర్ కు చెందిన సుర్బానా జురాంగ్ సంస్థ అప్పట్లో 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి మాస్టర్ ప్లాన్ అందించింది. ఇప్పుడు సీఆర్డీఏ పిలిచిన రెండో దశ మాస్టర్ ప్లాన్ కోసం పిలిచిన టెండర్లలోనూ సుర్బానా జురాంగ్‌ సంస్థ కూడా బిడ్‌ దాఖలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. తొలి దశలో సుర్బానా సమగ్ర ప్రణాళికలతో పాటుగా మౌలిక వసతుల అభివృద్ధి ప్రణాళిక అందించింది. ఏ ప్రాంతంలో ఎలాంటి సంస్థలు ఏర్పాటు చేయాలనే సూచనలు చేసింది. ఇక.. ఇప్పుడు రెండో దశ మాస్టర్ ప్లాన్ లో భాగంగా కనల్స్టెన్సీ సంస్థ స్పేషియల్, ఇన్‌ఫ్రా ప్లాన్‌తో పాటు ఆర్థిక ప్రణాళికను రూపొందించే బాధ్యత తీసుకోనుంది.

అందులో భాగంగా విస్తరణ ప్రణాళికల్లో ప్రభుత్వ భూములతో సహా మొత్తం 7 గ్రామాల పరిధిలో 20,494 ఎకరాలు ఉంది. వాటిలో స్పోర్ట్స్ సిటీ, రైల్వేలైన్, రైల్వే స్టేషన్, అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వంటి ప్రాజెక్టులను ప్లాన్​ చేస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం, స్మార్ట్‌ పరిశ్రమలు వంటి ప్రాజెక్టుల కోసం రాబోయే రోజుల్లో మరింత భూమి సమీకరించాలని నిర్ణయం తీసుకున్నారు. వీటిని పరిగణలోకి తీసుకొని రెండోదశ మాస్టర్ ప్లాన్ సిద్దం చేయనున్నారు. ఇదే సమయంలో ఏపీ రాజధానిగా అమరావతి చట్టవద్దత కల్పించే కీలక బిల్లుకు పార్లమెంట్ ఆమోద ముద్ర వేయనుందనే వార్తలు వస్తుండటంతో రాజదాని రైతుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తం అవుతున్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos