దౌర్జన్యాలు,దాడులు, చెరసాలలు వెలుగుని బంధించలేవు.. అని బెయిల్ వచ్చినట్లుగా బ్రేకింగ్ న్యూస్ రాగానే నిన్న బుధవారం అంబటి రాంబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి పోస్టు పడింది. ఆయన జైల్లో ఉన్నారు కాబట్టి ట్విట్టర్ వాడలేరు. ఆయన పేరుతో అకౌంట్ మేనేజ్ చేసేవారు వేసి ఉంటారు. ఇప్పుడు ఆయన నాలిక్కరుచుకుని ఉంటారు. ఎందుకంటే ఆయన ఇప్పుడే విడుదల కావడం లేదు. మరో కేసులో ఆయనకు పీటీ వారెంట్ పడింది. మున్సిపల్ సివిల్ కోర్టు పీటీ వారెంట్ ఇవ్వడంతో ఆయనను గురువారం కోర్టులో హారజరు పర్చనున్నారు. దానర్థం ఆ కేసులో కూడా మళ్లీ బెయిల్ తెచ్చుకోవాలన్నమాట.

ఈ కేసు వివరాలు ఏమిటంటే.. సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన వెలగబెట్టిన ఘనకార్యాలలో ఒకదానిపై కేసు నమోదు అయింది. ఆయన సంక్రాంతి సంబరాలను నిర్వహించేవారు. అలాగే తన సంబరాలకు టిక్కెట్లు పెట్టేవారు. వాలంటీర్లను పెట్టి ప్రభుత్వ లబ్దిదారుల నుంచి రూ.200 వసూలు చేసి టిక్కెట్లు అంటగట్టేవారు. ఈ అంశంపై అప్పట్లో ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ హయాంలోనే కేసు నమోదు అయింది. ఇప్పుడు అది పీటీ వారెంట్ కు పనికి వచ్చింది. పోలీసులు ఆయన్ను జైల్లోనే కొనసాగిస్తున్నారు.

ఈ కేసులో ఆయన బెయిల్ పిటిషన్ వేసుకోవాలి. విచారణలు జరగాలి. మళ్లీ బెయిల్ రావాలి. కానీ ఎన్ని కేసులు ఇంకా పీటీ వారెంట్ల కోసం పోలీసులు దాచి ఉంచారో తెలియదు. గతంలో ఆయనపై చాలా ఫిర్యాదులు వచ్చాయి. కేసులూ నమోదయ్యాయి. ఎన్నికల సమయంలోనూ.. ఆ తర్వాత కూడా ఆయన చాలా వరకూ అక్రమాలకు పాల్పడ్డారు. ఎన్నెన్ని కేసులు గుప్తంగా ఉన్నాయో కానీ.. అంబటి రాంబాబు తొందరపడి ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్ కామెడీగా మారుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos