ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి నిర్వహించనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే విడుదలైన పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చేసినట్లు స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది క్యాలెండర్ ప్రకారం ఉగాది పండగ మార్చి 20వ తేదీన రావడంతో, ఆ రోజున నిర్వహించాల్సిన ఇంగ్లిష్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ తెలిపింది. దీంతో ఇంగ్లిష్ పరీక్షను మార్చి 20కి బదులుగా మార్చి 21వ తేదీన నిర్వహించనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్పును విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు గమనించాలని సూచించింది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. అన్ని పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించనున్నారు. పరీక్షల సమయాల్లో ఎలాంటి మార్పు లేదని విద్యాశాఖ స్పష్టం చేసింది.

మారిన EXAM టైమ్‌టేబుల్ ప్రకారం పరీక్షల తేదీల వివరాలు ఇలా ఉన్నాయి. 

మార్చి 16 - ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 18 - సెకండ్ లాంగ్వేజ్
మార్చి 21 - ఇంగ్లిష్ (మార్చి 20 నుంచి మారింది)
మార్చి 23 - మ్యాథమెటిక్స్
మార్చి 25 - ఫిజికల్ సైన్స్
మార్చి 28 - బయాలజికల్ సైన్స్
మార్చి 30 - సోషల్ స్టడీస్

విద్యార్థులు తాజా షెడ్యూల్‌ను అనుసరించి తమ రివిజన్ ప్లాన్ సవరించుకోవాలని, ఎలాంటి గందరగోళానికి లోనుకాకుండా అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos