ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 11వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. సుమారు నెల రోజుల పాటు, అంటే మార్చి 12 వరకు ఈ సమావేశాలు అత్యంత సుదీర్ఘంగా సాగనున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టబోతున్న పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ కావడంతో, దీనిపై అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సామాన్య ప్రజానీకంలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. సమావేశాల తొలి రోజైన ఫిబ్రవరి 11న గవర్నర్ జస్టిస్ అబ్దుల్‌ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్తు ప్రణాళికలు, గత ఏడాది సాధించిన విజయాలను ప్రభుత్వం వివరించనుంది. రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుకు దిక్సూచిగా నిలిచే 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రధాన బడ్జెట్‌ను  ఫిబ్రవరి 14న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. అదే రోజున  సాగు రంగం కోసం ప్రత్యేకంగా రూపొందించిన  వ్యవసాయ బడ్జెట్‌ ను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమర్పించనున్నారు. ఉమ్మడి బడ్జెట్‌తో పాటు వ్యవసాయ బడ్జెట్‌ను కూడా అదే రోజు ప్రవేశపెట్టడం ద్వారా రైతాంగానికి ఇచ్చే ప్రాధాన్యతను ప్రభుత్వం చాటనుంది.

ముఖ్యంగా ఎన్నికల హామీలైన  సూపర్ సిక్స్ పథకాలకు కేటాయింపులు, అమరావతి నిర్మాణం,  పోలవరం ప్రాజెక్టులకు నిధుల సర్దుబాటు ఈ బడ్జెట్‌లో ప్రధానాంశాలుగా ఉండనున్నాయి. ఈ సమావేశాలు కేవలం ఆర్థిక లెక్కలకే పరిమితం కాకుండా, రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలతో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.   సుమారు 30 రోజుల పాటు సాగే ఈ బడ్జెట్ కసరత్తులో వివిధ శాఖల పద్దులపై చర్చలు, ప్రభుత్వ బిల్లుల ఆమోదం వంటి కార్యక్రమాలు ఉంటాయని తెలుస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos