ఏపీ ప్రభుత్వం 2026-27 వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 3,32,205 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించారు. కాగా, ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 2,56,143 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ. 53,915 కోట్లు గా పేర్కొన్నారు. రెవెన్యూ లోటు రూ. 22,002 కోట్లు ఉండగా.. ద్రవ్య లోటు రూ. 75,868 కోట్లు గా వెల్లడించారు. అయితే.. ప్రాధాన్యత రంగాలకు భారీగా కేటాయింపులు చేసారు. డిప్యూటీ సీఎం పవన్.. లోకేష్ శాఖలతో సహా సంక్షేమానికి కేటాయింపుల్లో ప్రాధాన్యత లభించింది.

ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ లో పోలవరానికి రూ.6,105 కోట్లు కేటాయింపులుగా వెల్లడించారు. విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌ ప్లాన్‌ను ఇప్పటికే సిద్ధం చేశామని.. విశాఖ, అమరావతి, తిరుపతి రీజియన్లను రాష్ట్రానికి కీలక గ్రోత్‌ ఇంజిన్లుగా గుర్తింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగా రాయలసీమ రీజియన్‌ను గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌గా మార్చాలని కంకణం కట్టుకున్నామని చెప్పారు. 2030 నాటికి ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని 14.41 లక్షల హెక్టార్లకు పెంచబోతున్నట్లు వెల్లడించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.6 వేల కోట్లు ప్రతిపాదించారు. విద్యుత్‌ రంగానికి రూ.13,934 కోట్లు, రోడ్లు, పోర్టు, ఎయిర్‌పోర్టులకు రూ.13,546 కోట్లు, పరిశ్రమలకు రూ.3,161 కోట్లు, సర్దుబాటు నిధి.. రూ.1,500 కోట్లు, వీబీ జీ రామ్‌ జీకి.. రూ.8365 కోట్లు, గృహ నిర్మాణ రంగానికి రూ.5,451 కోట్లు, ఎన్టీఆర్‌ వైద్య సేవకు రూ.4000 కోట్లు, జల్‌ జీవన్‌కు రూ.4,000 కోట్లు, స్వచ్ఛ భారత్‌ మిషన్‌కు రూ.1,037 కోట్లు, విశాఖ ఆర్థిక ప్రాంతానికి రూ.28,000 కోట్లు ప్రతిపాదించారు.

అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా - రూ.27,719 కోట్లు, దీపం 2.0 - రూ.2,601 కోట్లు, వివిధ వర్గాలకు ఆర్ధిక మద్దతు - రూ.2,320 కోట్లు, స్త్రీశక్తి - రూ.1,420 కోట్లు, వీకర్ సెక్షన్లకు సబ్సిడీ, ఉచిత విద్యుత్ - రూ.600 కోట్లు, ఆటో డ్రైవర్ల సేవలో - రూ.450 కోట్లు, తల్లికి వందనం - రూ.9,668 కోట్లు, స్త్రీ, శిశు సంక్షేమం - రూ.4,581 కోట్లు, ఉపకారవేతనాలు - రూ.3,836 కోట్లు, సమగ్ర శిక్ష - రూ.2,946 కోట్లు, ఉన్నత విద్య - రూ.2,566 కోట్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం - రూ.2,161 కోట్లు కేటాయించారు. 

అదేవిధంగా మన బడి, మన భవిష్యత్ - రూ.1,500 కోట్లు, నైపుణ్యాభివృద్ధి - రూ.1,232 కోట్లు, పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా - రూ.707 కోట్లు, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్ధి మిత్ర - రూ.654 కోట్లు, యువత, క్రీడలు - రూ.438 కోట్లు, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు - రూ.9,906 కోట్లు, అన్నదాత సుఖీభవ - రూ.6,600 కోట్లు, పోలవరం - రూ.6,105 కోట్లు, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన - రూ.1,927 కోట్లు, ధరల స్థిరీకరణ నిధి - రూ.500 కోట్లు, మత్స్యకార సేవలో - రూ.260కోట్లు, పంటల బీమా - రూ.250 కోట్లు, పీఎం కృషి సించాయి యోజన రూ.190 కోట్లుగా బడ్జెట్ లో కేటాయింపులు చేసారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos