వెలగపూడి | ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం ఇవాళ సచివాలయంలో జరగనుంది. వచ్చే జూన్ 12 నాటికి కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తవుతుంది. దానిపై ప్రధానమైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ ఏడాదిలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమం, పారిశ్రామిక వృద్ధిపై పెద్ద ఎత్తున చేపట్టాల్సిన ప్రచారం, మున్ముందు అమలు చేయనున్న సంక్షేమ కార్యక్రమాలపై కేలండర్ రూపకల్పనపైనా చర్చించనున్నారు. ఎస్‌ఐపీబీ 6వ సమావేశంలో ఆమోదించిన 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ.33 వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్‌లో ఆమోదం తెలుపనున్నారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులపైనా చర్చించనున్నారు. ఉద్యోగుల బదిలీలు, పలు సంస్థలకు భూకేటాయింపులపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. మొత్తం 25 అంశాల అజెండాగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఏపీ లెదర్ అండ్ ఫుట్‌వేర్ పాలసీ 4.0కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఉద్యోగుల బదిలీలపై కూడా ఈ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకోనున్నారు. పలు సంస్థలకు భూ కేటాయింపులపై కూడా మంత్రి మండలి చర్చించనుంది.
మున్సిపల్ చట్టానికి సంబంధించి కొన్ని సవరణలపై కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది.. రాజధాని నిర్మాణ పనులు, ఇతర అంశాలు, ఐకానిక్ టవర్ల నిర్మాణం వీటికి సంబంధించి కూడా కేబినెట్‌లో చర్చిస్తారు.. కేబినెట్ సమావేశం తరువాత తాజా రాజకీయ పరిణామాలు చర్చించే అవకాశం ఉంది.. లిక్కర్ అరెస్టులకు సంబంధించి ప్రధానంగా కేబినెట్ తర్వాత చర్చ జరగనున్నట్టుగా తెలుస్తోంది.. తాజా రాజకీయ పరిణామాలు.. మహానాడులో చర్చించే ప్రభుత్వ సంక్షేమం కార్యాచరణ ఎజెండా.. ఏడాది పాలనలో మంత్రుల పాత్ర.. ఇవన్నీ చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos