ఏపీ మంత్రివర్గం ఇవాళ బుధవారం ఉదయం వెలగపూడి సచివాలయంలో సమావేశం కానుంది. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించనున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఇతర మంత్రులు దీనికి హాజరుకానున్నారు. పలు ప్రతిపాదనలు చర్చకు రానున్నాయి. దాదాపు 50కి పైగా అంశాలను మంత్రివర్గం చర్చించనుంది. వాటికి సంబంధించిన కొన్ని తీర్మానాలను ఆమోదించే అవకాశం ఉంది. చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ నిర్వహించిన దావోస్ పర్యటనకు సంబంధించిన వివరాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. దావోస్ పర్యటన వివరాలు, వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో కుదుర్చుకున్న ఒప్పందాల గురించి ఈ సందర్భంగా చంద్రబాబు.. మంత్రులకు వివరిస్తారని తెలుస్తోంది. పెట్టుబడులతో పాటు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై కీలక నిర్ణయాలపై మంత్రి వర్గం చర్చించనుంది. పలు సంస్థలకు భూకేటాయింపుల గురించి మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయించిన నిధులు, ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన కొన్ని తీర్మానాలను మంత్రులు ఆమోదిస్తారని చెబుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, తేదీల ఖరారుపై సూచన ప్రాయ నిర్ణయాలు తీసుకోవచ్చని సమాచారం. సాయంత్రం 4 గంటలకు రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షిస్తారు చంద్రబాబు.

రాజధాని అమరావతి పరిధిలో రోడ్లు, డ్రైనేజీ, నీటిసరఫరా పనుల ప్యాకేజీకి ఇదివరకే కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో దీనికి సంబంధించిన పనుల గురించి మంత్రివర్గం చర్చించే అవకావం ఉంది. విశాఖపట్నంపై ప్రత్యేకంగా చర్చిస్తారని తెలుస్తోంది. వివిధ పారిశ్రామిక సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తుండటంతో వారికి భూముల కేటాయింపుపై చర్చిస్తారని సమాచారం. రహదారుల అభివృద్ధితో పాటు వివిధ కార్యక్రమాలతో చంద్రబాబు మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. 29న చంద్రబాబు అరకులో పర్యటిస్తారు. 30, 31 తేదీల్లో కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని సమాచారం.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos