ఆంధ్రప్రదేశ్‌లో భూ సంబంధిత సమస్యల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేసి సత్ఫలితాలనిచ్చిన 'రెవెన్యూ క్లినిక్' విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు విస్తరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. జయలక్ష్మి నిన్న శుక్రవారం రాత్రి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ కొత్త విధానం ప్రకారం .. రాష్ట్రంలోని ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో 'ప్రత్యేక రెవెన్యూ డెస్క్' (రెవెన్యూ క్లినిక్) ఏర్పాటు చేస్తారు. ఇకపై భూసమస్యలపై అర్జీ ఇవ్వడానికి వచ్చే పౌరులకు కేవలం రసీదు మాత్రమే కాకుండా, వారి సమస్యను ఎవరు, ఎప్పటిలోగా పరిష్కరిస్తారో స్పష్టంగా పేర్కొంటూ ఒక 'సర్టిఫైడ్ యాక్షన్ ప్లాన్' (కార్యాచరణ పత్రం) అందిస్తారు. ఈ పత్రంపై డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి సంతకం ఉంటుంది. దీంతో తమ పని పురోగతి గురించి తెలుసుకునేందుకు ప్రజలు పదేపదే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి తమ జిల్లాలో అమలు చేస్తున్న 'రెవెన్యూ క్లినిక్' విధానం విజయవంతమైన తీరును ముఖ్యమంత్రికి వివరించారు. ఈ విధానం ద్వారా అర్జీల పునరావృతం తగ్గడం, ప్రజల్లో నమ్మకం పెరగడం గమనించిన సీఎం చంద్రబాబు, దీనిని తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సీసీఎల్‌ఏను ఆదేశించారు. ఈ నిర్ణయంపై కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. "జిల్లాలో మేం ప్రవేశపెట్టిన విధానాన్ని ప్రభుత్వం గుర్తించి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తుండటం చాలా సంతోషంగా ఉందని... ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని" ఆయన పేర్కొన్నారు.

ఈ ప్రక్రియ కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను కూడా వినియోగిస్తున్నారు. అర్జీ నమోదు చేసిన వెంటనే, సమస్య పరిష్కారానికి పట్టే సమయం, బాధ్యత గల అధికారి వివరాలతో యాక్షన్ ప్లాన్ జనరేట్ అవుతుంది. అంతేకాకుండా, గడువు ముగిశాక ఐవీఆర్ఎస్ (IVRS) ద్వారా అర్జీదారునికి ఆటోమేటెడ్ కాల్ వెళ్లి, సమస్య పరిష్కారమైందో లేదో ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు. ఈ నూతన విధానంతో రెవెన్యూ యంత్రాంగంలో జవాబుదారీతనం పెరిగి, ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ఆశిస్తున్నామని అధికారులు వివరించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos