ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రజలకు మేలు జరిగేలా వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఒకవైపు ఎన్నికల హామీల్లో భాగమైన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తుండటంతో పాటు అదనంగా పేద వర్గాల ప్రజలు, రైతులకు మేలు జరిగేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమైంది.

రాష్ట్రలో కూటమి ప్రభుత్వం ఈ నెల 24వ తేదీ నుంచి ‘రైతన్నా మీకోసం’ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయంలో పంచసూత్రాలు అమలు ద్వారా రైతులకు కలిగే మేలుపై వారి ఇళ్లకు వెళ్లి ప్రజాప్రతినిధులు, అధికారులు వివరించనున్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. డిసెంబర్ 3న రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్ షాపులు నిర్వహిస్తారు. వ్యవసాయ, అనుబంధ రంగాలు, మార్కెటింగ్ శాఖ అధికారులు, సిబ్బంది సహా 10వేల మందితో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచసూత్రాలపై రైతులకు అవగాహన కల్పించే అంశంపై దిశానిర్దేశం చేశారు. నీటిభద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతు అనే పంచసూత్రాల విధానాన్ని చేపట్టామని, వీటిపై రైతులకే కాకుండా వారి కుటుంబసభ్యులకు కూడా అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు సూచించారు. పాడి రైతులు, పౌల్ట్రీ, గొర్రెల పెంపకందారులు, ఆక్వా, ఉద్యాన, సెరికల్చర్ రైతులకూ అవగాహన కల్పించాలని సూచించారు. రైతు సేవా కేంద్రాల్లో ఉండే సిబ్బంది ముందుండి దీన్ని చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు.

రైతన్నా.. మీ కోసం కార్యక్రమం ద్వారా.. శాస్త్రీయ వ్యవసాయంతోనే రైతులకు గిట్టుబాటు అవుతుంది. దీని కోసం ఆదునిక పద్దతుల ద్వారా పంటలకు మరింత విలువ జోడించేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఇంటింటికీ వెళ్లి ప్రజాప్రతినిధులు, అధికారులు వివరించనున్నారు. రైతులు ఏ పంటలు వేశారు..? వారికి ఎలాంటి సాయం అవసరమనే విషయాన్ని నేరుగా తెలుసుకుని, సాగులో పురుగు మందుల వినియోగం వల్ల కలిగే నష్టాలను  రైతన్నా.. మీకోసం కార్యక్రమం ద్వారా రైతులకు వివరించనున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos