ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరో ఎన్నికల హామీ అమలుకు సిద్దమైంది. రేపు బుధవారం నుంచే ఈ పథకం అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. చేనేతలకు 'పవర్' గిఫ్ట్ ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేసింది. రేపటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత విద్యుత్ అమలు చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా మగ్గాలకు 200, మరమగ్గాలకు 500 యూనిట్లు ఫ్రీగా ఇవ్వనున్నారు. దీంతో, ఏడాదికి రూ.150 కోట్లు ఖర్చు ప్రభుత్వం చేయనుండగా.. 1,04,488 చేనేత కుటుంబా లకు లబ్ధి కలనుంది. దీంతో.. ఎన్నికల ముందు ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్నట్లైందని కూటమి నేతలు చెబుతున్నారు. చేనేత పరిశ్రమకు ఉచిత విద్యుత్‌ పథకం అమలు వల్ల ఏడాదికి రూ.85 కోట్ల మేర ప్రభుత్వంపై భారం పడనుంది. ఉచిత విద్యుత్‌ వల్ల 93 వేల మగ్గాలు, 10,534 మర మగ్గాలతో కలిపి 1,03,534 చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. తాజాగా ఈ పథకం అమలు ద్వారా మగ్గానికి నెలకు రూ.720, ఏడాదికి రూ.8,640, మర మగ్గాలకు నెలకు రూ.1,800, ఏడాదికి రూ.21,600 లబ్ధి కలుగుతుందని అధికారులు వివరించారు. ఆప్కో ద్వారా చేనేత సహకార సంఘాలకు రూ.7కోట్ల బకాయిలు చెల్లించినట్లు వెల్లడించారు.

ఆప్కోలో రెడీమేడ్‌ దుస్తుల అమ్మకాలతో నేతన్నలకు ఉపాధి పెరిగిందని, ఈ-కామర్స్‌ ద్వారా చేనేత వస్త్రాలు విక్రయిస్తున్నామని వివరించారు. చేనేతల్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, వారికి అవస మైన రుణాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, మార్కెటింగ్ వంటి అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా చేనేత ఉత్పత్తులను సమర్థవంతంగా మార్కెటింగ్ చేయగలుగుతున్నారని అధికారులు వివరించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos