సింగపూర్ : సెమీకండక్టర్ల తయారీకి ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 30 రోజుల్లో ఏపీకి వచ్చి అమల్లో ఉన్న పాలసీలను పరిశీలించాలని ముఖ్యమంత్రి సింగపూర్ పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. సింగపూర్‌లో సెమీకాన్ రౌండ్ టేబుల్ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్‌లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అనుసరిస్తున్నామని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులకు భారత్ అత్యంత సురక్షితమైన ప్రాంతమని, అందులో ఆంధ్రప్రదేశ్ అనుకూలమైన రాష్ట్రమని... పెట్టుబడులకు ఇది సరైన సమయమని సీఎం వ్యాఖ్యానించారు. సెమీకండక్టర్ల తయారీకి ఏపీలో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని వివరించారు. రాయలసీమలో త్వరలోనే ఓ సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు అవుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. డిఫెన్సు, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, ఫైటర్ జెట్‌ల తయారీ సహా ఆటోమొబైల్ తయారీ కేంద్రంగా రాయలసీమ ప్రాంతంలో అవకాశాలున్నాయని అన్నారు. సెమీకండక్టర్లపై ఏర్పాటు చేసిన సెమీకాన్ ఎకోసిస్టమ్ రౌండ్ టేబుల్ సమావేశానికి సింగపూర్ లోని వివిధ సెమీకండక్టర్ తయారీ పరిశ్రమల ప్రతినిధులు హాజరయ్యారు. గ్లోబల్ ఫౌండ్రీస్, ఎన్ఎక్స్ పీ, ఏఎస్ఎంపీటీ, ఒన్ సిస్టమ్ టెక్నాలజీస్, టెక్సెండ్ ఫోటోమాస్క్, ఆక్వాటెక్ తదితర సెమీకండక్టర్ తయారీ సంస్థలు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Take Oath As A TDP National Working President | CM Chandrababu | AG

తాజా వార్తలు

15-49-17-0617.jpg

మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం.. ఆర్టీజీఎస్ పై సమీక్షలో అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
2026-06-22 Time: 03:49:17

15-31-26-0626.jpg

ప్రజా ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టులు.. 4 అంశాలపై ప్రోగ్రెస్ రిపోర్టులను విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు
2026-06-22 Time: 03:31:26

17-02-16-0616.jpg

అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు.. చిన్నారులతో కలిసి రాగి జావ తీసుకున్న చంద్రబాబు
2026-06-20 Time: 05:02:16

14-06-28-0628.jpg

90వ రోజు ప్రజాదర్బార్.. వివిధ సమస్యలపై ప్రజల  వినతుల స్వీకరణ.. అన్నివిధాల అండగా ఉంటానట్టు  మంత్రి లోకేష్ హామీ
2026-06-16 Time: 02:06:28

14-04-35-0635.jpg

సెమీకండక్టర్ల తయారీకి ఏపీ బెస్ట్ డెస్టినేషన్.. సింగపూర్‌లో సెమీకండక్టర్లపై సెమీకాన్ ఎకోసిస్టమ్ సదస్సులో సీఎం చంద్రబాబు
2026-06-16 Time: 02:04:35

Related Videos